గతేడాది సీజన్ సమయానికి తోతాపురి కేజీకి రూ.8 గిట్టుబాటు ధరను ప్రకటించారు. ఆ ధరను పక్కాగా అమలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది. మామిడి రైతులను నట్టేట ముంచేసింది. ఫ్యాక్టరీలు రూ.4 ఇస్తే చోద్యం చూసింది. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర ప్రకారం జిల్లాలో 3.75 లక్షల మెట్రిక్ టన్నులకు గాను రూ.300 కోట్ల వరకు చెల్లించాలి. వాళ్లు అందులో 50 శాతం ఎగ్గొట్టారు. ఇదిపోను ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు ఇంత వరకు చెల్లింపులే చేయలేదు. వారిపై ఎలాంటి చర్యలు లేవు.
– మునీశ్వర్‌రెడ్డి, రైతునాయకులు, చిత్తూరు


