డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 23 మందికి జరిమానా | - | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 23 మందికి జరిమానా

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

– రోజంతా కోర్టులో నిల్చోబెట్టిన

న్యాయాధికారి

చిత్తూరు అర్బన్‌: మద్యం తాగి వాహనాలు నడిపిన వేర్వేరు కేసుల్లో మొత్తం 23 మంది జరిమానాలు విధిస్తూ చిత్తూరులోని న్యాయస్థానాలు సోమవారం ఆదేశాలు జారీచేశాయి. చిత్తూరు ట్రాఫిక్‌ సీఐ నిత్యబాబు గత రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. 13 మందిపై కేసు నమోదుచేసి కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున 13 మందికి రూ.1.3 లక్షల జరిమానా విధిస్తూ.. ఒకరిని రోజంతా కోర్టులో నిలబెడుతూ చిత్తూరులోని స్పెషల్‌ జుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కె.పరిమళాదేవి తీర్పునిచ్చారు. అలాగే గుడిపాలలో మద్యం సేవించి వాహనం నడిపినవాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వాళ్లపై ఎస్‌ఐ రామ్మోహన్‌ కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. వీరిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఇద్దరికి రూ.20 వేల జరిమానా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 8 మందికీ ఒక్కొక్కరికీ రూ.వెయ్యి చొప్పున.. రూ.8 వేలు జరిమానా విధిస్తూ చిత్తూరులోని ఎకై ్సజ్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ కల్పన తీర్పునిచ్చారు.

ఘాటెక్కిన మిరప

– అమాంతం పెరిగిన ధర

పలమనేరు: ఈ దఫా మిరప ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం స్థానిక మార్కెట్లో క్వింటాళ్‌ మిరప ధర రూ.22 వేలు పలుకుతోంది. స్థానికంగా నెలకొన్న డిమాండ్‌తో పాటు చైనా నుంచి ఎగుమతులుండడంతోనే ఇలా ధరలు ఆకాశాన్నంటాయనే మాట వ్యాపారుల నుంచి వ్యక్తమవుతోంది. కాగా హైబ్రిట్‌ రకాలైన టమాటమిర్చి, ఎల్లోమిర్చీ ధరలు రూ.40 వేల దాకా పలికిన విషయం తెలిసిందే.

తగ్గిన మిరప సాగు

పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్‌లో ఏటా మూడువేల హెక్టార్లలో మిరప సాగయ్యేది. గత నాలుగేళ్లుగా ఈ సీజన్‌లో మిరప ధరలు ఢీలా పడ్డాయి. అదే విధంగా ఈదఫా ధరలు తగ్గుముఖం పడతాయని రైతులు మిరప సాగుపై ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఇక్కడ 450 ఎకరాలు మాత్రమే మిరప సాగైంది. దీంతోపాటు ధరలున్నప్పుడు విక్రయించుకోవాల ని భద్రపరిచిన మిరపను సైతం రైతులు విక్రయించేశారు. మిరపను కొన్న వ్యాపారులు మాత్రం బాగా సంపాదించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement