కీర్తి పతాక.. అన్షుమాలిక
నగరి: మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షుమాలిక అమెరికాలో కీర్తిపతాకాన్ని ఎగురవేసింది. తన ప్రతిభ తో అరుదైన గుర్తింపు పొందింది. అమెరికాలో ‘హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్‌డ్ సీనియర్’ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా ఖ్యాతి గడించింది. బ్లూమింగ్ టన్ ఇండియానా యూనివర్సిటీలో అన్షుమాలిక కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఇందు లో ఐదేళ్లకొకసారి ప్రెసిడెంట్ హెర్మన్ బివెల్స్ గౌరవా ర్థం ప్రతిష్టాత్మకమైన ‘హెర్మన్ బివెల్స్ డిస్టింగ్విష్‌డ్ సీనియర్’ అవార్డు అందిస్తుంది. అలాంటి అత్యున్నత పురస్కారాన్ని శనివారం తల్లిదండ్రులు ఆర్‌కే రోజా, ఆరేకే సెల్వమణి సమక్షంలో అన్షుమాలిక అందుకుంది. అమెరికాలో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థిని అన్షుమాలిక కావడం విశేషం. యూనివర్సిటీలో గౌరవ ప్రదర్శనగా ఉంచే బోర్డులో ఉత్తమ విద్యార్థినిగా ఆమె పేరు లిఖించిన బంగారు ఫలకం జీవితకాలం ఉండిపోతుంది.
అవార్డులు.. పురస్కారాలు
అంతర్జాతీయ స్థాయిలో విశిష్టమైన అవార్డులు అందుకుంటూ అన్షుమాలిక తన ప్రతిభను చాటుతోంది. ఇప్పటికే ‘యూనివర్సిటీ అవుట్‌స్టాండింగ్ లీడర్‌షిప్ అవార్డు’ అందుకుంది. ‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్’ నవల ను రచించి దక్షిణ భారతదేశంలో ఉత్తమ రచయిత్రిగా గుర్తింపు పొందింది. నైజీరియాలో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫెస్టివల్‌లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో ‘గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డు, ‘మౌరిన్ బిగ్గర్స్ అవార్డును కూడా అందుకుంది. ప్రస్తుతం అందుకున్న అవార్డుతో మరో మైలురాయిని చేరుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కుప్పం అక్రమ క్వారీలకు కేరాఫ్‌గా మారింది. రెండేళ్లుగా అధికార పార్టీ నేతలు క్వారీలను ఆదాయ వనురులుగా మార్చుకుని ఇస్టానుసారంగా మైనింగ్ పనులు చేపడుతున్నారు. శాంతిపురం, గుడుపల్లె మండలాల్లో టీడీపీ నేతల సహకారంతో అక్రమ క్వారీలు వెలిశాయి. పలగంతా పనులు చేయడం రాత్రులు దర్జాగా లారీల్లో తమిళనాడు రాష్ట్రానికి గ్రానైట్‌ను తరలించడం నిత్యకృత్యంగా మారింది. లీజు లేకుండా సాగుతున్న క్వారీల గురించి అడిగే నాథుడేలేడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికార పార్టీకి చెందిన నేతల అండదండలతో కుప్పం నియోజకవర్గంలో అక్రమ క్వారీలు దర్జాగా సాగిస్తున్నారు. ఇక్కడ లభించే గ్రానైట్‌కు తమిళనాడులో మంచి డిమాండ్ ఉండడంతో అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా తవ్వుకునేందుకు అతనుమతులిచ్చి వారి నుంచి పెద్ద మొత్తంలో వసూ లు చేసుకుంటున్నారు. ప్రధానంగా గుడుపల్లె మండలంలోని యామనూరు, ద్రవిడ వర్సిటీ, కనమనపల్లి, కమ్మగుట్టపల్లి, శాంతిపురం మండలంలోని సి.బండపల్లి, రాళ్లబూదుగూరు, సోమాపురం గ్రామాల పరిధిలోని క్వారీ గుట్టల్లో మైనింగ్ వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. పగలంతా గుట్టు చప్పుడు కాకుండా క్వారీల్లో గ్రానైట్ తవ్వకాలు చేపట్టి రాత్రిళ్లు లారీల్లో తమిళనాడు రాష్ట్రంలోని జగదేవి, హోసూర్, చైన్నె, క్రిష్ణగిరి పట్టణాలకు తరలిస్తున్నారు. అక్రమ క్వారీల పై ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి ఒకటి, రెండు గ్రానైట్ వాహనాలను సీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. అక్రమ క్వారీ వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు మాత్రం శూన్యమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చేతులు తడిపితే చాలు అనుమతులు
టీడీపీ బడా నేతలకు చేతులు తడిపితే చాలు అక్రమ క్వారీలకు అనుమతులు లభిస్తున్నాయి. క్వారీల్లో హిటాచీ, ప్రొక్లెయినర్ వంటి వాహనాలతో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారు. నాయకులకు కొంత, జేసీబీలు వంటి భారీ వాహనాలు పెట్టే వారికి కొంత మొత్తం చెల్లించేలా టీడీపీ నాయకులు ధర నిర్ణయించారు. దీని ప్రకారం రాత్రి క్వారీల్లో తవ్వకాలు చేపట్టేవారు సంబంధిత నాయకులు మనుషుల వద్ద నిర్ణయించిన ధర చెల్లించి తరలించుకుంటున్నారు. ఇలా టీడీపీ నియోజకవర్గ బడా నేత ఖాతాలో నగదు జమచేస్తే క్వారీలకు అడ్డు అదపు ఉండదు. అంతేకాకుండా క్వారీ నిర్వహించే ప్రాంతంలో బూత్ కన్వీనర్ నుంచి మండలం స్థాయి నాయకుడి వరకు ప్రతినెలా మామూళ్లు కూడా చెల్లించాల్సిందే.
రాత్రికి రాత్రే సరిహద్దు దాటుతున్న గ్రానైట్
కుప్పం నియోజకవర్గంలోని అక్రమ క్వారీల నుంచి రాత్రికి రాత్రే గ్రానైట్ రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. రాతి దిమ్మెలు తరలించేందుకు పర్మిట్లు తీసుకోకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ టీడీపీ నాయకులు దర్జాగా సంపాదిస్తున్నారు. సరిహద్దుల్లోని చెక్ పోస్టు నుంచి క్వారీల వరకు అందరికీ మామూళ్లు అందడంతో అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వదిలేస్తోంది.
వరుస దాడులు
కుప్పం నియోజకవర్గంలోని అక్రమ క్వారీలపై ఇటీవల పోలీసులు వరుస దాడులు చేశారు. కుప్పం మండలం వసనాడు గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే తమిళనాడుకు గ్రానైట్‌ను తరలిస్తుండగా శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా శాంతిపురం మండలం సోలిశెట్టి గ్రామం వద్ద హిటాచీ వాహనంతో అక్రమ క్వారీ నడుపుతున్న లక్ష్మీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి క్వారీని సీజ్ చేశారు. కాగా గత రెండేళ్లుగా అక్రమ క్వారీలను పట్టించుకోని పోలీసులు అకస్మాత్తుగా క్వారీలపై దాడి చేయడం హాట్ టాఫిక్‌గా మారింది. పోలీసుల దాడుల్లో టీడీపీ నాయకులకు చెందిన రెండు క్వారీలు బయటపడ్డాయి. ఇంకా దాడులు చేస్తే ఇంకా మరెన్నో అక్రమ క్వారీలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
యూనివర్సిటీ గౌరవ ప్రదర్శన బోర్డులో ఉన్న తన బంగారు ఫలకం పక్కన అన్షుమాలిక
తల్లిదండ్రులతో కలిసి హెర్మెన్ బివెల్స్ అవార్డును చూపుతున్న అన్షుమాలిక


