ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించరాదని పోలీసులు నిత్యం చెబుతున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ముగ్గురు, నలుగురు ప్రయాణిస్తున్నారు. వి.కోట పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద ఆదివారం ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై నలుగురిని ఎక్కించుకుని హెల్మెట్ లేకుండా దర్జాగా వెళుతూ కనిపించాడు. వి.కోట పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో నిత్యం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఇలా నిర్లక్ష్యంగా ప్రయాణం మంచిది కాదని స్థానికులు వాపోతున్నారు. – వి.కోట


