● యువకుడి మృతి ● మరొక యువకుడికి తీవ్ర గాయాలు
శ్రీరంగరాజపురం: మండలంలోని ముద్దికుప్పం సమీపంలో శనివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ సుమన్ కథనం మేరకు.. ముద్దికుప్పం గ్రామానికి చెందిన శరవణ, పాతపాళ్యం దళితవాడకు చెందిన చంద్రన్ ద్విచక్ర వాహనంలో పళ్లిపట్టు వెళ్లారు. తిరిగి శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో స్వగ్రామానికి బయలుదేరారు. ముద్దికుప్పం మధ్యలో వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొని కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు 108లో ఆస్పత్రికి తలించారు. శరవణ మార్గమధ్యంలో మృతి చెందాడు. చంద్రన్ చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


