చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలోని తేనేబండ రెవెన్యూలో ఇరువారం–చెర్లోపల్లి బైపాస్ మధ్య 10.33 ఎకరాల భూమి ఉంది. ఈ స్థలాన్ని ఎస్టీల హబ్‌గా తీర్చిదిద్దాలని జిల్లా అధికారు లు భావించారు. చదును చేసే పనులు ప్రారంభించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ఎకరా భూమి రూ.కోటి వరకు పలుకుతోంది. దీంతో కొందరు ఎస్టీల పేరుతో కొట్టేయాలని చూశారు. బినా మీలను ముందస్తు బుకింగ్ చేయించుకున్నారు. రూ.3 లక్షలు ఉంటే భూమి తీసిస్తామని ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ విషయం ఆనోటాఈ నోటా పడి కలెక్టర్‌కు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
మారిన ప్లానింగ్
దళారుల దందాను పసిగట్టిన అధికారులు ప్లాన్‌ను మార్చేశారు. ఈ భూమిని కమర్షియల్‌గా మార్పు చేస్తూ ఏపీఐఐసీకి అప్పగించారు. మార్కెట్ విలువ ప్రకారం ఎకరా భూమిని రూ.కోటిగా ధర ప్రకటించారు. ఈ భూమిని విలువను, రోడ్డు వసతిని ఒక కంపెనీ గుర్తించింది. రెవెన్యూ అధికారులు ప్రణాళికలను వేగవంతం చేసి ఏపీఐఐసీకి ద్వారా ఆ కంపెనీకి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. త్వరలో ఈ భూమి మొత్తం ఈస్ట్ మెన్ కంపెనీ చేతికి వెళ్లనుందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఈ కంపెనీ నిర్మాణం పూర్తయితే 2,500 మందికి ఉపాధి దొరుకుతుందని రూరల్ తహసీల్దార్ కల్యాణి పేర్కొన్నారు.
చిత్తూరు తేనెబండ రెవెన్యూలో ఎస్టీల అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎస్టీలను కొంత మందిని ఓ చోటకు తీసుకొచ్చి వారి అభివృద్ధికి బాట లు వేయాలనుకుంది. వారికి స్థలం కేటాయించి వసతులు కల్పించాలని భావించింది. ఈ మేరకు 10.33 ఎకరాల భూమిని చదును చేసింది. స్థలం విలువ తెలుసుకున్న కొంతమంది దళారులు దాన్ని స్వాహా చేయాలని చూశారు. ఈ విషయం కల్టెక్టర్ దృష్టికి వెళ్లడంతో ప్లాన్ మారింది. ఆ భూమిని ఏపీపీఐఐసీకి అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు.


