చట్టాలపై అవగాహనతోనే న్యాయం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహనతోనే న్యాయం

Apr 19 2026 7:35 AM | Updated on Apr 19 2026 7:35 AM

చట్టాలపై అవగాహనతోనే న్యాయం

చిత్తూరు అర్బన్‌: దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చి న బీఎన్‌ఎస్‌ఎస్‌, బీఎన్‌ఎస్‌ చట్టాలపై జడ్జీలు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే కక్షిదారులకు న్యాయం అందుతుందని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా పరిపాలన జడ్జి జస్టిస్‌ నినాల జయసూర్య తెలిపారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం చిత్తూరు, మదనపల్లె, తిరుపతి లోని జడ్జీలకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ కొత్తగా నియమితులైన న్యాయాధికారులు కేసుల విచారణ, సాక్ష్యాల నమోదు, కక్షిదారులకు న్యాయం జరగాలంటే కొత్త చట్టాలపై పట్టు ఉండాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక మాట్లాడు తూ ఐపీసీ–బీఎన్‌ఎస్‌ మధ్య సంబంధం, కొత్తగా ప్రవేశపెట్టిన సెక్షన్లు, రద్దు చేసిన అంశాలు, పోక్సో, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ తదితర అంశాలపై చర్చించారు. రిసోర్స్‌ పర్సన్లు రిటైర్డు జిల్లా జడ్జీలు విరూపాక్ష దత్తాత్రేయ గౌడ, కృష్ణయ్య పలు అంశాలను వివరించారు. జడ్జీలు రమేష్‌, శ్రీదేవి, భారతి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పాఠశాలల అభివృద్ధిలో

హెచ్‌ఎంలదే కీలకపాత్ర

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో హెచ్‌ఎంలదే కీలకపాత్ర అని డీఈవో రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. పీసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన రెండు రోజుల వృత్యంతర శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. డీఈవో మాట్లాడుతూ పాఠశాల అంటే వందలాది మంది పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దే దేవాలయమన్నారు. అనంతరం హెచ్‌ఎంల సంఘం రూపొందించిన ప్రత్యేక హ్యాండ్‌ బుక్‌ను హెచ్‌ఎంలకు అందజేశారు. జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, రిసోర్స్‌పర్సన్లు చెంగల్‌రాజు, గిరిరాజా, హేమాద్రి, రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement