4 టన్నుల గంజాయి కాల్చివేత | - | Sakshi
Sakshi News home page

4 టన్నుల గంజాయి కాల్చివేత

Apr 18 2026 8:29 AM | Updated on Apr 18 2026 8:29 AM

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయి విక్రయాల జోరు

విశాఖ నుంచి వచ్చే గంజాయికి కేంద్రంగా రేణిగుంట

పట్టణాల్లోని కళాశాల విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు

తిరుపతి నుంచి చైన్నె, బెంగళూరు, కేరళకు సరఫరా

పల్లెలకు పాకిన గంజాయి విక్రయాలు

రెండేళ్ల వ్యవధిలో నాలుగు డివిజన్లలో 4 టన్నుల గంజాయి స్వాధీనం

ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా బ్రిడ్జి

మాజీ మంత్రి ఆర్కే రోజా కృషి ఫలితం

ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం ..
జీఎస్టీతో భారత ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం చేశారని ప్రముఖ ఆర్థిక నిపుణులు, ఎస్వీయూ ఆచార్య సవరయ్య తెలిపారు.
మహిళా పక్షపాతి జగనన్న
మహిళా పక్షపాతి జగనన్న అని చిత్తూరు వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లు కొనియాడారు.

శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

దొరికితేనే దొంగ..లేకపోతే దొర అన్న

చందంగా తిరుపతి, చిత్తూరు జిలాల్లో

గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా

సాగుతోంది. మన్యంలో పండిస్తున్న

గంజాయి ఘాటు జిల్లాను కుదిపేస్తోంది. ఒడిశా సరిహద్దుల్లో సాగు చేస్తున్న గంజాయి విశాఖ నుంచి రేణిగుంటకు చేరవేస్తున్నారు. ఇక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీనికితోడు

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని కళాశాలల్లో విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఈ దందాలో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. ఇదీ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గంజాయి గుట్టు.

రేణిగుంట: జిల్లాలో పట్టుబడిన సుమారు 4,100 కిలోల గంజాయిని కోర్టు అనుమతితో డిస్‌పోజ్‌ చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ డా.ఎస్‌. వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. రేణిగుంట మండలంలోని తూకివాకం వద్ద ఉన్న సాలిడ్‌ వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌లో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు సమక్షంలో చట్టపరమైన విధానాల ద్వారా కరెంట్‌ యంత్రం ద్వారా కాల్చివేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గంజాయి పండించడం, రవాణా, వినియోగంపై చాలా కఠినంగా వ్యవహరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇందులో భాగంగానే ఈగల్‌ సంస్థను ఏర్పాటు చేసి, ఐజీ ర్యాంక్‌ అధికారిని నియమించి ప్రతి జిల్లాలో అనుబంధంగా అధికారులను ఏర్పాటు చేసి గంజాయి, ఇతర డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి జిల్లాలో గత రెండు నుంచి మూడు సంవత్సరాల్లో సీజ్‌ అయిన గంజాయిని తూకివాకంలో ఇన్సినరేషన్‌ పద్ధతి ద్వారా డిస్పోజ్‌ చేస్తున్నామని, సుమారు 208 కేసుల్లో పట్టుబడిన సుమారు రూ.20 కోట్ల విలువైన 4,100 కేజీల గంజాయిని కోర్టు నుంచి అనుమతి తీసుకుని డిస్పోజ్‌ చేస్తున్నామన్నారు. దీని ద్వారా గంజాయి రవాణా, వినియోగించే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లవుతుందన్నారు. తిరుపతి పట్టణం బెంగళూరు, చైన్నెకి ఒక ట్రాన్సిట్‌ పాయింట్‌గా గంజాయి రవాణాలో గుర్తించడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లాకు ఎక్కువగా ఏఎస్‌ఆర్‌ జిల్లా నుంచి వైజాగ్‌, కాకినాడ మీదుగా బస్సుల్లో, ఇతర ప్రైవేట్‌ వాహనాల్లో తిరుపతికి వచ్చి, ఇక్కడి నుంచి చైన్నె, బెంగళూరు, కేరళకు వెళ్లడం గమనించామన్నారు. వాటిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సెర్చ్‌ పార్టీలను పెట్టి రైళ్లు, బస్సులు, లగేజీలను పరిశీలించి చేసి సీజ్‌ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి జిల్లాలో సుమారు 15 పీడీ కేసులు పెట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీలు, డిఎస్పీలు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అభయహస్తం శక్తి యాప్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : శక్తి యాప్‌ ఆపదలో అభయహస్తం అని మహిళా స్టేషన్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో మహిళల భద్రత, చట్టా లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలు, పిల్ల ల భద్రతే పరమావధిగా పోలీసు శాఖ అడుగులు వేస్తోందన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహ న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్నప్పుడు శక్తి యాప్‌ ద్వారా పోలీసులకు తక్షణమే సమాచారం ఎలా పంపాలి అనే అంశం పై ప్రదర్శన నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

లక్ష్యాన్ని అధిగమించాం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లా మైనింగ్‌ శాఖ 2025– 26 ఆర్థిక సంవత్సరానికి నిర్ధేశించిన ఆదా య లక్ష్యాన్ని అధిగమించిందని ఆ శాఖ డీడీ సత్యనారాయణ పేర్కొన్నారు. చిత్తూరులోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. జిల్లాకు మొత్తం రూ. 196.05 కోట్ల లక్ష్యం ఉండగా, రూ.195.67 కోట్ల మేర వసూళ్లు సాధించి 99.81 శాతం ప్రగతి నమోదు చేసినట్లు తెలిపారు. డివిజన్లన్‌వారీగా చూస్తే, చిత్తూరు డివిజన్‌న్‌లో రూ.145.52 కోట్ల లక్ష్యానికి గాను రూ.150.33 కోట్లు వసూలు చేసి 103.31 శాతం సాధించినట్టు తెలిపారు. అదే సమయంలో పలమనేరు డివిజన్‌లో రూ.50.53 కోట్ల లక్ష్యం ఉండగా, రూ.45.34 కోట్లు వసూళ్లు చేసినట్టు తెలిపారు. భవిష్యత్‌లో మిగిలిన లోటు ను భర్తీ చేసేందుకు చర్యలు చేపడ తామని తెలిపారు.

వివరాల నమోదు తప్పనిసరి

చిత్తూరు కార్పొరేషన్‌: కార్మిక బీమా పథకంలో నమోదైన అర్హులైన భవననిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా సహాయ కార్మికశా ఖ కమిషనర్‌ ఆలోచన తెలిపారు. ఇదివరకే నమోదైన వారు రెన్యూవల్‌ చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా అమలు చేస్తున్న నాలుగు పథకాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నమన్నారు. వివాహ బహుమతి, ప్రసూతి ప్రయోజన పథకం తదితర పథకాలను 2026 మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలకు చిత్తూరు ఎఎల్‌ఓ–1 రాజయ్య 9492555223, చిత్తూరు ఎఎల్‌ఓ–2 ఆనందబాబు 9492555224, పుత్తూరు, పుంగనూరు ఎఎల్‌ఓ మధుబాబు 9492555225 నంబర్లను సంప్రదించాలని కోరారు.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: ‘‘తిరుపతి జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో ఉన్న 35 పోలీస్‌ స్టేషన్లలో 208 కేసుల్లో గడచిన రెండు, మూడేళ్లలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలు అక్షరాలా 4,098 కిలోలు. విస్తుగొలిపే ఈ అధికారిక గణాంకాల ఆధారంగా చూస్తే తిరుపతి జిల్లాలో యువత భవితను చిత్తు చేస్తున్న మత్తుపదార్థం గంజాయికి ఇది తార్కాణం. ఓ వైపు రాష్ట్ర పాలకులు గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని గుక్కతిప్పుకోకుండా శపథాలు చేస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.’’

విద్యార్థులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం

తిరుపతి, రేణిగుంటలకు వచ్చే గంజాయిలో సింహభాగం పక్క రాష్ట్రాలకు తరలించి, జిల్లాకు అవసరమైన సరుకును వేరు చేసి, ఇక్కడ నియమించుకున్న టీములు ద్వారా పట్టణంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. కళాశాలలతోపాటు హాస్టళ్లు, పీజీల వద్దకు చేరుకుని చిన్నపాటి కవర్లలో నింపిన గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. అలాగే హోటళ్లలో బస చేసే యాత్రికులకు సైతం గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పరిధిలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాలలోనూ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

లెక్కకు మించి ఎల్లలు దాటుతున్న గంజాయి

తిరుపతికి చేరే గంజాయిపై పోలీసులు నిఘా పెట్టి పట్టుకుంటేనే కేవలం నాలుగు డివిజన్లలోనే నాలు గు టన్నుల గంజాయి పట్టుబడి కోర్టు అనుమతితో గంజాయిని కాల్చివేశారు. అయితే పోలీసులకు, ఇతర నిఘా వ్యవస్థకు చిక్కకుండా ఎల్లలు దాటుతున్న గంజాయి ఏ మేరకు అక్రమ రవాణా జరుగుతుందో ఊహాతీతం. పుణ్యక్షేత్ర జిల్లాగా పేరుగాంచిన తిరుపతి జిల్లాను దాటాకే దక్షిణాది రాష్ట్రాలకు గంజాయి సరఫరా అయ్యేది.

గంజాయి మత్తులో పెరుగుతున్న అకృత్యాలు, దాడులు

గంజాయి మత్తుకు అలవాటుపడిన ఆకతాయిల అకృత్యాలు జిల్లాలో నిత్యకృతమయ్యాయి. ఇటీవల రేణిగుంటలో ఓ యువకుడు గంజాయి మత్తులో మటన్‌ కత్తితో పట్టపగలు నడిబజార్‌లో తన గొంతు తానే కోసుకుంటూ భయాందోళన రేకెత్తించాడు. రేణిగుంట పట్టణంలో స్థానిక యువకులు కూడా కొందరు గంజాయి మత్తుకు బానిసై జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం గంజాయి అక్రమ రవాణా చేసే ప్రధాన ముఠాను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే గానీ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చటం కష్టసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జికి పచ్చజెండా

డీఎల్‌డీవో ఆకస్మిక తనిఖీ

పెద్దపంజాణి: పలమనేరు డివిజినల్‌ పంచాయతీ అధికారి రామచంద్రయ్య శుక్రవారం మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా లింగాపురం, రాజుపల్లి పంచాయతీలలో పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించారు. చెత్త సేకరణ, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ గురించి గ్రామస్తులకు వివరించారు. లింగాపురం సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తదుపరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జనగణన శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జన గణనలో భాగంగా ఏప్రిల్‌ 16 నుంచి 30వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆన్‌లైన్‌ ద్వారా స్వీయ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాలలో తహసీల్దార్‌ రామ్మూర్తి, ఎంపీడీవో బాలాజీ, డిప్యూటీ ఎంపీడీవో శారదాదేవి, ఏఎస్‌వో ఆయేషా, ఫీల్డ్‌ ట్రైనర్స్‌ గురుప్రసాద్‌, బాలాజి, పీఎస్‌ రిజ్వానా, వీఆర్వో కృష్ణంరాజు పాల్గొన్నారు.

21 విద్యుత్‌

సమస్యల పరిష్కారం

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 34 సమస్యలు, ఎల్‌టీ లైన్ల పరంగా 59, సర్వీసు లైన్‌ 3 కలిపి మొత్తం 96 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. అందులో 21 సమస్యలను పరిష్కారించామని, మిగిలిన వాటి పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్టు వెల్లడించారు.

కొను గోల్‌మాల్‌!

సాధారణంగా ఏదైనా ప్రభుత్వశాఖలో ఫర్నిచర్‌ కొనుగోలు ప్రక్రియలో రూ.5 లక్షలు దాటితే కచ్చితంగా టెండర్‌ ప్రక్రియ నిర్వహించాలి. జిల్లాలోని 39 పాల్‌ ల్యాబ్స్‌కు ఫర్నిచర్‌ కొనుగోలుకు రూ.20 లక్షల బడ్జెట్‌ కేటాయించారు. జిల్లా సమగ్రశిక్షశాఖ అధికారులు కలెక్టర్‌కు ఫైల్‌ పంపి అనుమతి తీసుకోవాలన్న కనీస నిబంధన కూడా తుంగలో తొక్కారు. నిబంధనలను బ్రేక్‌ చేసి నేరుగా కాంట్రాక్టర్‌ ఖాతాలోకి ఫర్నిచర్‌ రాకముందే నిధులు జమచేసేశారు.

ప్రజల కోసం రోజమ్మ పోరాటం

తిరుపతి కేంద్రంగా గంజాయి సరఫరా

అల్లూరి సీతారామరాజు జిల్లాలో సాగవుతున్న గంజాయిని రైళ్లు, బస్సులు, లారీలు, వస్తు రవాణా మార్గాల మీదుగా తిరుపతికి నిత్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలోని ప్రధాన పట్టణాల్లోని కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం ఓ పక్క నిఘా వ్యవస్థను పెంచి, గంజాయి అక్రమ రవాణా ఆనవాళ్లను గుర్తించి కేసులు పెడుతున్నా గంజాయి సరఫరా మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా రైళ్లలో గంజాయి రేణిగుంటకు సరఫరా అవుతోంది. ఇక్కడ నుంచి చైన్నె, బెంగళూరు, కేరళ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది.

పుత్తూరులో ప్రతిపాదిత పనుల్లో చేర్చిన రైల్వే శాఖ

Advertisement
 
Advertisement
Advertisement