పుత్తూరు: జీఎస్టీ సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం చేసిందని ప్రముఖ ఆర్థిక నిపుణులు, ఎస్వీయూ ఆచార్య జి.సవరయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారతీయ సామాజిక శాస్త్రాల పరిశోధన సంస్థ (ఐసీఎస్‌ఎస్‌ఆర్) విభాగం వారి ఆర్థి క సహాయంతో గ్రామ, పట్టణ ప్రజల జీవితాలపై జీఎస్టీ సంస్కరణల ప్రభావం అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఎకనామిక్స్ విభాగం వారి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సదస్సుకు తొలిరోజు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.చంద్రమౌళి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య సవరయ్య మాట్లాడుతూ జీఎస్టీ 2.0లో చాలా వస్తువుల ధరలు తగ్గడం ద్వారా ప్రజల కొనుగోలు పెరిగిందన్నారు. కమర్షియల్ టాక్స్ విభాగం అడిషనల్ కమిషనర్ జే.వీ.ఎం.శర్మ మాట్లాడుతూ జీఎస్టీ వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పన్ను చెల్లింపులు సులభతరమయ్యాయన్నారు. అనంతపురం సెంట్రల్ యూని వర్సీటీ అర్థశాస్త్ర విభాగం ఆచార్యులు డాక్రట్ ఎండీ బావయ్య మాట్లాడారు. వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం పన్ను శాతం తగ్గించడంతో వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఎరువుల ధరులు తగ్గా యని తెలిపారు. అనంతరం జాతీయ సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి సమర్పించిన 110 పరిశోధన పత్రా లు కలిగిన సంచికను అతిథులు ఆవిష్కరించారు. సదస్సులో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జీ.కోటేశ్వరయ్య, కన్వీనర్ టీ.నరసింహులు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల యూ నివర్సిటీలు, డిగ్రీ కళాశాలల పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


