మహిళా పక్షపాతి జగనన్న | - | Sakshi
Sakshi News home page

మహిళా పక్షపాతి జగనన్న

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

చిత్తూరు కార్పొరేషన్‌: మహిళా పక్షపాతి జగనన్న అని స్థానిక వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లు కొనియాడారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి సతీమణి ఇందుమతి ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్‌ కట్‌ చేశారు. ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. రాష్ట్రంలో మహిళను తొలిసారిగా ఉపముఖ్యమంత్రి, హోంమంత్రిని చేసిన ఘనత వైఎస్‌ జగనన్నదేనన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో, కాంట్రాక్ట్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇచ్చారని గుర్తుచేశారు. ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీదే ముద్రించారన్నారు. కార్యక్రమంలో నాయకులు హరిణిరెడ్డి, లీనారెడ్డి, అంజలిరెడ్డి, సరళమేరీ, భాగ్యలక్ష్మి, రేఖ, ప్రతిమ, కౌసర్‌, సల్మా, బింధు, పూంగొడి, పద్మరెడ్డి, ముబీనా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement