హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు | - | Sakshi
Sakshi News home page

హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు

Apr 17 2026 10:32 AM | Updated on Apr 17 2026 10:32 AM

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని గురువారం ఆలయ అధికారులు పగడ్బందీగా లెక్కించా రు. ఈవో పెంచలకిషోర్‌ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.1.41కోట్ల ఆదా యం వచ్చింది. బంగారం 32 గ్రాములు, వెండి1.420 కిలోలుగా లెక్కకట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.8,449, నిత్యాన్న దా నం హుండీ ద్వారా రూ.1,45,499లు వచ్చింది. యూఎస్‌ఏవి 169 డాలర్లు, కెనడా 5 డాల ర్లు, ఇంగ్లాడ్‌ 110 పౌండ్స్‌, ఆస్ట్రేలియావి 75 డాలర్స్‌, సౌదీ 1,110 రియాల్స్‌ వచ్చాయి. చైర్మన్‌ మణినాయుడు, డీఈవో సాగర్‌బాబు, ఏఈవోలు ఎస్వీ క్రిష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్‌, ధనపాల్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement