– బావిలో మునిగి
యువకుడి మృతి
గంగవరం: ఈత కొడుతూ బావిలో మునిగిపోయి యువకుడు మృతి చెందిన ఘటన గంగవరం మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హైకాంత్ కుటుంబంతో సహా మండలంలోని కీలపల్లి సమీపంలోని ఓ డెయిరీలో పని చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. కీలపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఈత కోసం తండ్రి హైకాంత్ తన కుమారుడు దేవ్ త్యాగి(22)ని వెంటపెట్టుకుని వెళ్లాడు. బావిలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు దేవ్‌త్యాగి నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి కేసు నమోదు కాలేదు.


