సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించండి

Apr 17 2026 10:32 AM | Updated on Apr 17 2026 10:32 AM

● ఎస్పీకి విన్నవించిన మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి

దళితులపై దాడులు అరికట్టండి

చిత్తూరు : జీడీ నెల్లూరు నియోజకవర్గంలో తిష్టవేసి న సమస్యలను పరిష్కరించి, బాధితులకు న్యా యం చే యాలంటూ మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి ఎస్పీ తుషార్‌డూడీకి విన్నవించారు. ఈ మేరకు ఆయ న గురువారం ఎస్పీ కార్యాలయానికి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభు త్వం వచ్చిన నాటి నుంచి దళితులపై దౌర్జన్యాలు పెచ్చుమీరాయన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని వాపోయా రు. రాజకీయ కక్షలు, కార్పణ్యాలు ఎప్పుడూ జీడీ నెల్లూరు నియోజకవర్గ చరిత్రలో జరగలేదని ఎస్పీకి వివరించారు.

బాబు మృతిపై విచారణ జరిపించండి

మండలంలోని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు రామానాయుడుపల్లి బాబు కూటమి ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్పీ దృష్టికి తెచ్చారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో భూ వివాదంపై పొన్నస్వామికి గ్రామస్తులకు మధ్య వివాదం ఉండగా.. టీడీ పీ సానుభూతిపరుడైన పొన్నుస్వామికి అప్పటి తహసీల్దార్‌ పట్టా ఇవ్వడంతో వివా దం పెరిగిందన్నారు. పలుమార్లు బ్యానర్‌ చించివేత కేసులో పోలీసులు వేధింపులకు గురి చేయడంతో బాబు మృతి చెందాడన్నారు. ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పై విచారం వ్యక్తం చేశారు.

కార్వేటి నగరంలోని సమస్యలు

కార్వేటినగరం మండలం, ముక్కరవారిపల్లి పంచాయతీలో వైఎస్సీర్‌సీపీ నాయకులు మురళీకృష్ణారెడ్డిపై టీడీపీకి చెందిన తిరుమలరెడ్డి భూ వివాదంలో తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులను పిలిపించి దాడి చేసినట్టు నారాయణస్వామి గుర్తుచేశారు. రాతి కుసా లు విరిచి వేయగా కార్వేటినగర పోలీస్‌ స్టేషన్లో ఫిర్యా దు చేసినట్టు చెప్పారు. అయితే దీనిపై కేసు నమోదు చేయలేదని తెలిపారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపా రు. గోపిశెట్టిపల్లి పంచాయతీలో భూ తగాదా విషయంలో వైఎస్సార్‌సీపీ సాను భూతిపరులపై దాడి చేయగా ఇరువర్గాలు ఇచ్చిన కేసులో టీడీపీ సానుభూతిపరులకు సానుకూలంగా కేసు నమోదు చేసి కౌంటర్‌ కేసు నమోదు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ వ్యక్తిగత విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తానని మాజీ డెప్యూటీకి హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement