– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
పదవులు పందేరంలో తమ్ముళందరికీ షాక్
మొదటి నుంచి జెండా మోసినా
పట్టించుకోని అధిష్టానం
పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్రస్థాయి పదవులను ప్రకటించిన టీడీపీ
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 13 మందికి చోటు కల్పించిన అధిష్టానం
ఎన్నికల తరువాత పార్టీలో చేరిన వారికీ కీలక పదవులు
ఎంత కష్టపడినా ప్రయోజనం లేదని టీడీపీ సీనియర్లు ఆగ్రహం
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంఅండ్ హెచ్‌వో నాగశశిభూషణ్‌రెడ్డి హెచ్చరించారు.
భలే మంచి వడ్డీ బేరమూ!
పలమనేరు టమాటా మార్కెట్‌లో కొంతమంది రోజువారి వడ్డీ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు.
గురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న చందంగా నిన్నమొన్న
పార్టీలోకి వచ్చిన వారికి పదవులు..
ఆది నుంచి పార్టీ జెండా మోసిన వారికి ఒట్టి చేతులు చూపారని పచ్చనేతలు
మండిపడుతున్నారు. తమను కరివేపాకు చందంగా వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పదవుల పందేరంలో చంద్రబాబు కుటిల రాజకీయం ప్రదర్శించారని వాపోతున్నారు.
వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన వారికి వైఎస్సార్ సీపీలో పలు విభాగాల్లో పదవులు దక్కాయి. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ప్రచార విభాగం ఉపాధ్యక్షుడిగా జీడీనెల్లూరు నియోజకవర్గానికి చెందిన పురంధర్, జిల్లా కార్యదర్శులుగా జీడీనెల్లూరు నియోజకవర్గానికి చెందిన యుగంధర్‌రెడ్డి, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన నరసింహరెడ్డి, పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన సాయి అవినాష్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శులుగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రమేష్, శ్రీనివాసులు, జిల్లా మైనార్టీ కార్యదర్శిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన మహమ్మద్ థౌహీడ్, జిల్లా బీసీ కార్యదర్శులుగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సుబ్బరాజు, సురేష్, గంగిరెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శులుగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన మల్లికార్జుననాయుడు, మునికృష్ణమనాయుడు, జిల్లా మహిళా విభాగం కార్యదర్శిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన యశోద, జిల్లా సోషల్ మీడియా కార్యదర్శిగా పూతలపట్టు నియోజవర్గానికి చెందిన రమేష్, జిల్లా యువత విభాగం కార్యదర్శులుగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన వినోద్‌రెడ్డి, లోకవినాయకరెడ్డి, పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన ప్రవీన్‌కుమార్ నియమితులయ్యారు. పుంగనూరు నియోజకవర్గ ఎంప్లాయీస్, పెన్సన్షర్ల విభాగం అధ్యక్షుడిగా వరదారెడ్డి, జీడీనెల్లూరు నియోజకవర్గంలోని ఎస్‌ఆర్‌పురం మండల యువత విభాగం ప్రధాన కార్యదర్శిగా యువరాజ్, జీడీనెల్లూరు మండల ఐటీ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కిరణ్‌కుమార్‌ను నియమించారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ అధిష్టానం ప్రకటించిన పదవుల పందేరంపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీవ్ర దుమారం రేగుతోంది. పార్టీ పుట్టినప్పటి నుంచి జెండా మోసిన వారికి కాకుండా నిన్న, మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంపై సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సుమారు రెండేళ్ల తర్వాత టీడీపీ అధిష్టానం బుధవారం పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించింది. ఈ జాబితాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్.విజయకుమార్ (తిరుపతి), ఎన్.అమర్నాథ్‌రెడ్డి (పలమనేరు), జి.నరసింహయాదవ్ (తిరుపతి), చిట్టిబాబు (జీడీ నెల్లూరు), రవినాయుడు (తిరుపతి), అన్నా అనిత (తిరుపతి), పురిమిట్ల కుమారి (తిరుపతి), జి.దశరథాచారి (శ్రీకాళహస్తి), ఎం.సుబ్బయ్య (శ్రీకాళహస్తి), పి.చందన స్రవంతి (సత్యవేడు), లక్ష్మీప్రసన్న (నగరి), ఆర్.మీరా నేతాజీ (నగరి), కర్జాల అరుణ (జీడీ నెల్లూరు) పదవులు లభించాయి. ఇందులో నలుగురు, ఐదుగురు మాత్రమే సీనియర్ నాయకులు ఉన్నారు. మిగిలిన వారిలో కొందరు ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన వారు. దీంతో మొదటి నుంచి జెండా మోసిన సీనియర్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పదవులు ఉన్న వారికి ప్రాధాన్యత లేనివి ఇచ్చారనే అసంతృప్తి అనేక మందిలో నెలకొంది.
ఎన్నికల సమయంలో మాత్రమే వారికి గుర్తింపు
టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉన్నత పదవులు లభించని అనేక మంది నాయకులను అధిష్టానం ఎన్నికలప్పుడు మాత్రమే వాడుకుని వదిలేస్తుందనే ప్రచారం ఉంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, ఆస్తులు పోగొట్టుకున్న నాయకులు ప్రస్తుతం పదవుల పందేరంలో తమకు చోటు దక్కకపోవడంతో తన అనుచరుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో మాత్రమే ముఖ్య నేతలు వచ్చి భుజాన చేయివేసి క్షేమ సమాచారాలు అడగడంతో గాల్లో తేలిపోయి పనిచేశామని చర్చించుకుంటున్నారు. ఓట్ల రాజకీయాలకు ఇకపై దూరంగా ఉండాలని సీనియర్ నాయకులు కొందరు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఉపాధి హామీ పనులు వేగవంతం
పూడి శ్రీహరి అరెస్టు అక్రమం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న జలధార–జలహారతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లో డ్వామా, పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు, ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతిరోజూ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఎంపీడీవోలు ఫీల్డ్ అసిస్టెంట్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పురోగతిపై సమీక్షలు చేయాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించినా, విధులకు గైర్హాజరైనా ఫీల్డ్ అసిస్టెంట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూలీల సమీకరణ కార్యక్రమంపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న కార్మికులను గుర్తించి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలు, వేతన హక్కులపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో చేపట్టాల్సిన పనులను వెంటనే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమీక్షలో డ్వామా పీడీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టు అక్రమమని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణి తెలిపారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మఫ్టీలో వచ్చిన పోలీసులు నోటీసు కూడా ఇవ్వకుండా తాడేపల్లిలోని తన నివాసానికి సమీపంలో శ్రీహరిని బలవంతంగా అదుపులోకి తీసుకుని వెళ్లారని తెలిపారు. ఇంటికి వెళ్లి వస్తానని శ్రీహరి కోరినా పట్టించుకోకపోవడం చట్ట విరుద్ధమన్నారు. మాజీ సీఎం జగనన్నను కలిసి వస్తుండగా మార్గమధ్యంలో అడ్డుకుని పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అతని వద్ద ఉన్న ఫోన్, ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో పౌర హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందని ఆరోపించారు. పోలీసుల తీరును కోర్టులు పలుమార్లు తప్పు పట్టినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఓట్ల కోసమే..
పదవుల కోసం కాదు
అందరికీ అన్యాయమే..
తిరుపతి బీసీ సామాజిక వర్గంలో యాదవులకు తప్ప మరొకరికి పదవులు దక్కడం లేదన్న అసంతృప్తి ఉంది. అది కూడా ఒకరిద్దరికి మాత్రమే పదవులు ఇచ్చారని, మిగిలిన మెజారిటీ సబ్ క్యాస్ట్‌లో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో సూరా సుధాకర్ రెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డి, బుల్లెట్ రమణ, కోడూరు బాలసుబ్రమణ్యం కమిటీల్లో పదవులు కోల్పోయారు. వీరంతా సీనియర్లు. అలాగే రాష్ట్ర పదవులు వస్తాయని ఆశించిన దంపూరి భాస్కర్ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, పులుగోరు మురళి, పుష్పలతను కరివేపాకులా వాడుకుంటున్నారని వారి అనుచరులు మండిపడుతున్నారు. సూళ్లూరుపేటకు చెందిన తిరుమూరు సుధాకర్‌రెడ్డి, వేనాటి సతీష్‌రెడ్డి, శంకరయ్యయాదవ్ సీనియర్లు అయినా పార్టీలో గుర్తింపు లభించలేదు. చంద్రగిరి పరిధిలో సీఎం చంద్రబాబు పేరు పెట్టి పిలిచే నాయకులు అనేక మంది ఉన్నా.. ఒక్కరికి కూడా చోటు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు పరిధిలో కూడా సీనియర్ నాయకులున్నా వారెవరికీ చోటు దక్కకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, దొరబాబు, చంద్రప్రకాష్, సుభాష్ చంద్రబోస్, చిట్టిబాబు నాయుడు, విజయబాబు, జయప్రకాష్ నాయుడు, గౌనివారి శ్రీనివాసులు, రామకుప్పానికి చెందిన ఆంజనేయరెడ్డి, దేయరాజులు నాయుడు జెండా మోయడానికే పరిమితం అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.


