గర్భం దాల్చాల్సిన చోట కాకుండా వేరే చోట ఏర్పడితే దాన్ని ఎక్టోిపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాన్ని ఎక్టోపిక్ గర్భం అంటారు. వందలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకు అవుతుందో..అంతు చిక్కదు. అండవాహికకు ఇన్‌ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా స్కాన్ చేసినప్పుడే తెలుస్తుంది.


