కూటమితోనే దళితులపై దాడులు | - | Sakshi
Sakshi News home page

కూటమితోనే దళితులపై దాడులు

Apr 15 2026 7:44 AM | Updated on Apr 15 2026 7:44 AM

● గత తహసీల్దార్‌ వల్లే గ్రామంలో అలజడులు ● పోలీసుల వేధింపులతోనే బాబు మృతి ● డెప్యూటీ సీఎం వద్ద బోరున విలపించిన మృతుని బంధువులు, గ్రామస్తులు

గంగాధర నెల్లూరు : రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం వస్తేనే దళితులపై దాడులు, కేసులు పెరిగిపోతాయని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వేధింపులు తాళలేక జీడీ నెల్లూరు మండలం, రామానాయుడుపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు బాబు పురుగుల మందు తాగి మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ మేర కు ఆయన మంగళవారం గ్రామానికి చేరుకు ని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కన్నీటి నివాళి

మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రామానికి చేరుకుని బాబు మృతదేహానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. కు టుంబ సభ్యులను ఓదార్చారు. నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి కూడా స్పందించారు. మృతుడు బాబు కుటుంబ అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు. బాబు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. కూట మి ప్రభుత్వ వేధింపుల వల్లే బాబు మరణించాడని మృతుని బంధువులు బోరున విలపించారు.

చిచ్చురేపిన రెవెన్యూ

నారాయణస్వామి మాట్లాడుతూ గ్రామంలో భూ తగాదా వల్ల బాబు నలిగిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే గ్రామంలోని కూటమి నాయకుడు పొన్నుస్వామికి అనుకూలంగా గత తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ గ్రామ కంట భూమిలో పట్టా ఇచ్చాడని పేర్కొన్నారు. దీంతో అలజడి రేగిందన్నా రు. పొన్నుస్వామి అధికార అండతో బాబు, గ్రామస్తులపై పలు కేసులు నమోదు చేయించాడని తెలిపారు. పోలీసులు బైండోవర్‌ పేరుతో వేధించడం వల్లే బాబు మృతి చెందాడని ఆరోపించారు. బాబు మృతికి కూట మి ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా జీడీ నెల్లూరు సీఐ తాము ఎప్పుడు బైండోవర్‌ పేరుతో బాబు, గ్రామస్తులను పిలిపించలేదని వీడియో రిలీ జ్‌ చేయడం దారుణమన్నారు. బాబు మరణానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయా లని డిమాండ్‌ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆయ న వెంట మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, సీనియర్‌ నేత గుణశేఖర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ హరిబాబు, మాజీ సర్పంచ్‌ సుబ్రహ్మణ్యం, ఏకాంబరం, యువనేత కిషోర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, మదన్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement