చిత్తూరు కలెక్టరేట్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం ఆదర్శనీయమని డీఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పలు కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. డీఈవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మురళి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా చేపట్టారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, డీఈవో కార్యాలయ సిబ్బంది రవిశేఖర్, స్వర్ణ, సాయి, గోపాల్, చైతన్య, శంకరప్ప, బాలాజీ, షణ్ముగం పాల్గొన్నారు.
100 మంది ఉద్యోగులకు సత్కారం
అంబేడ్కర్ ఆశయ సాధనలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినాయకం అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ భవనంలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సులోచన, జిల్లా ఆర్థిక కార్యదర్శి షణ్ముగం, నాయకులు శేషాద్రి, రెడ్డెప్ప, కృష్ణయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూ కార్యాలయంలో..
జిల్లా కేంద్రంలో ఎస్టీయూ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోఅంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు పురుషోత్తం, దేవరాజులురెడ్డి, బాలచంద్రారెడ్డి, గుణశేఖరన్, చంద్రన్, రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు.


