క్వారీతో ప్రాణాలు పోతున్నాయి! | - | Sakshi
Sakshi News home page

క్వారీతో ప్రాణాలు పోతున్నాయి!

Apr 14 2026 7:58 AM | Updated on Apr 14 2026 7:58 AM

పచ్చికాపల్లం దాసరి కాలనీలో మురుగునీటి కాలువలేకపోవడంతో వర్షపు నీరు వీధులపై పారుతోంది. తద్వారా వీధులు బురదగుంటను తలపిస్తున్నాయి. కాలువ నిర్మించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. కాలువ నిర్మించి, సమస్యను పరిష్కరించాలని కోరారు. తార్లబైలు గ్రామం నుంచి ఎల్లారెడ్డి గుంతలు వరకు రోడ్డ నిర్మాణం చేపట్టి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.

ఏడాదికాలంగా పింఛన్‌ కోసం తిరుగుతు న్నా న్యాయం జరగలేందటూ మారేపల్లె గ్రామానికి చెందిన రవిబాబు వేడుకున్నాడు. పెరాలసిస్‌తో అవస్థలు పడుతున్నా కనికరించలేదని ఆవేదనవ్యక్తం చేశాడు.

50 యేళ్లుగా మా ఆదీనంలో ఉన్న భూమిని రెడ్డెప్పరెడ్డి, చిన్నబ్బరెడ్డి తమదంటూ గత నాలుగు నెలలుగా తమ ను వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తంగేళిమిట్ట గ్రామానికి చెందిన పార్వతి బోరుమంది.

20 యేళ్లుగా గూడులేక అవస్థులు పడుతున్నా ఎవరూ పట్టించుకోలేదని ధర్మాచెరువు గ్రామానికి చెందిన గుణసుందరి వేడుకుంది. ఇంటి స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేయాలని కోరింది.

వెదురుకుప్పం: ‘క్వారీ పేలుళ్లతో మా ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. గోడలు బీటలు వారుతున్నాయి. ప్రాణాలు పోతాయేమోనని భయమేస్తోంది’ అంటూ బందార్లపల్లె వాసులు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. పేదలకు సీజేఎఫ్‌ఎస్‌ భూము ల్లో పట్టాలి ఇప్పించాలంటూ దేవరగుడిపల్లె దళితులు.. మురుగుతో మగ్గిపోతున్నామంటూ దాసరి కాలనీకి చెందిన యువకులు.. గ్రామానికి శ్మశాన వాటిక లేక మృతదేహాలను తీసుకెళ్లడానికి అవస్థలు పడుతున్నామంటూ మాంబేడు గ్రామస్తులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వందల సంఖ్యలో వివిధ సమస్యలతో వచ్చి జిల్లా కలెక్టర్‌ సుమీత్‌కుమార్‌ వద్ద తమ కన్నీటి పర్యంతమయ్యారు. సోమ వారం వెదురుకుప్పంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే థామస్‌, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వెదురుకుప్పం మండలం నుంచే కాకుండా పెనుమూరు, శ్రీరంగరాజపురం, కార్వేటినగరం మండలాల నుంచి అర్జీదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల నుంచి కలెక్టర్‌ ఫిర్యాదులను స్వీకరించారు.

అర్జీల వెల్లువ

పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొత్తం 158 అర్జీలు రాగా ఇందులో రెవె న్యూ సమస్యలే అధికంగా వచ్చాయి. రెవెన్యూ శాఖ కు సంబంధించి 35, సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌రికార్డ్స్‌ 77, పంచాయతీ రాజ్‌ 9, విద్యుత్‌శాఖ 7, పింఛన్‌ 6, ఏపీఎస్‌ఆర్‌టీసీ 3, పశుసంవర్థక శాఖ 3, గృహనిర్మాణశాఖ 3, వాటర్‌ రిసోర్సు 2, రూరల్‌ వాటర్‌ సఫ్లై ఇంజినీరింగ్‌ 2, పోలీస్‌ శాఖ 2, విభిన్న ప్రతిభావంతులు, విద్యాశాఖ, ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌, అటవీశాఖ, షెడ్యూల్డ్‌ ట్రైబల్‌ కో–ఆపరేటీవ్‌ కార్పొరేషన్‌, మున్సిపల్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ చొప్పున వచ్చినట్లు అధికారులు తెలిపారు.

నివాసముండలేకపోతున్నాం

‘మా గ్రామానికి పక్కనే పొలాల వద్ద ఉన్న బండపై క్వారీ నిర్వహణకు అధికారులు అనుమతులిచ్చారు. ఈ క్వారీలోంచి పెద్ద ఎత్తున పేలుళ్లు జరుపుతున్నారు. అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి’ అంటూ కొమరగుంట పంచాయతీ, బందార్లపల్లె గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన గ్రామస్తులు తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో నిరసనకు దిగారు. బండపై బోరు డ్రిల్లింగ్‌ వేసి బ్లాస్టింగ్‌ చేయడంతో ఇళ్లు బీటలు వారుతున్నాయన్నారు. స్లాబ్‌ పెచ్చులూడి పోతోందని విచారం వ్యక్తం చేశారు. క్వారీలోంచి వచ్చే దుమ్ముధూళి, వ్యర్థాల వల్ల పశుపోషణ భారంగా మారుతోందన్నారు. తాగునీరు కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అవస్థలను గుర్తించి క్వారీని అపకుంటే గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేశారు.

● ‘మాంబేడు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నం.31,37, 43, 45లోని కాలువ (ప్రభుత్వ) భూమిని కొందరు అగ్రకులస్తులు కబ్జాచేశారు. కాలువ గుండా రాకపోకలు లేకుండా అడ్డుకుంటు న్నారు. ఈ ఆక్రమణలను తొలగిస్తే వంద మంది రైతులకు సంబంధించి సుమారు 350 ఎకరాల మేరకు సులభంగా దారి వేసుకోవచ్చు. గ్రామానికి శ్మశాన వాటిక లేనందున మృత దేహాలను తీసెకెళ్లేందుకు దారి లేక నానాఅవస్థలు పడుతున్నాం’ అంటూ మాంబేడు గ్రామానికి చెందిన పేదలు ఫిర్యాదు చేశారు.

పేదలకు పట్టాలు ఇవ్వాలి

మండలంలోని దేవరగుడిపల్లె సమీపంలో ఉన్న సీజేఎఫ్‌ఎస్‌ భూములను పేదలకు ఇవ్వాలని దళితులు అర్జీలు ఇచ్చారు. గతంలో కొంత మందికి పట్టాలిచ్చినా మరికొంతమంది పేదలకు ఇవ్వకపోవడంతో గుర్తించి అందరికీ పట్టాలు ఇవ్వాలని గ్రామానికి చెందిన మహేష్‌, రాజాజి తదితరులు వినతి పత్రం ఇచ్చారు.

సమస్యలన్నీ పరిష్కరించండి

ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో ఎలాంటి పక్షపాత ధోరణి వహించడకూడదని కలెక్టర్‌ సుమీత్‌ కుమార్‌గాంధీ స్పష్టం చేశారు. తహసీల్దార్‌ పరిధిలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కిరించాలని ఆదేశించారు. మండల స్థాయిలో అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నా రు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్‌ బాబు, ఎంపీడీఓ పురుషోత్తం, మాజీ ఎంపీటీసీ మోహన్‌మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

బాధితులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ

న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్న బందార్లపల్లె గ్రామస్తులు

తమ సమస్యలను ఆన్‌లైన్‌లో

రిజిస్టర్‌ చేసుకుంటున్న అర్జీదారులు

పింఛన్‌ కోసం పడిగాపులు కాస్తున్న రవిబాబు

Advertisement
 
Advertisement
Advertisement