ఇంత వరకు నగదు చెల్లించలేదు | - | Sakshi
Sakshi News home page

ఇంత వరకు నగదు చెల్లించలేదు

Apr 14 2026 7:58 AM | Updated on Apr 14 2026 7:58 AM

గత సీజన్‌లో మామిడి సరఫరా చేసిన తమకు ఇంతవరకు పరిశ్రమ నిర్వాహకులు నగదు చెల్లించలేదని బాధిత రైతులు వాపోయారు. సోమవారం కలెక్టరేట్‌లో రైతులు నిరసన చేపట్టారు. రైతు నాయకులు హరిబాబుచౌదరి మాట్లాడుతూ చిత్తూరు, తవణంపల్లి మండలాల్లోని నలిశెట్టిపల్లి, నారసింహనపల్లి, కె.గొల్లపల్లి, కరణంవాండ్లఊరు, ఏనుగుండ్లపల్లె పరిసర గ్రామాల రైతులు చిత్తూరు రూరల్‌ మండలంలోని పరిశ్రమకు మామిడి సరఫరా చేశారన్నారు. కొత్త సీజన్‌ వచ్చినా ఇప్పటి వరకు నగదు చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం నగదు చెల్లింపులు జరిపేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement