చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చిత్తూ రు నగరంలోని ప్రశాంత్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో మంగళవారం అవగాహన ర్యాలీ, సమా వేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌న్‌చార్జ్ వైద్యఆరోగ్యశాఖ అధికారి వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ఆరో గ్యంపై అవగాహన కల్పించారు. 2026 సంవత్సరానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన థీమ్ ‘ఆరోగ్యం కోసం కలిసి.. విజ్ఞానంతో అడుగులు’ అని తెలి పా రు. అపోహలు, మూఢనమ్మకాలను విడిచిపెట్టి శాసీ్త్రయ వైద్య విధానాలను అనుసరించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించారు. ప్రజల ఆరోగ్యం వారి జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని, కలుషిత ఆహారం, పర్యావరణం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని పేర్కొన్నారు. రసాయనాలతో మాగబెట్టిన పండ్లు తినడం ఆరోగ్యానికి హానికరమమన్నారు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్మయి, ఇన్‌చార్జ్ డెమో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.


