పాలిటెక్నిక్‌తో చక్కటి భవిత | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌తో చక్కటి భవిత

Mar 8 2026 7:46 AM | Updated on Mar 8 2026 7:46 AM

కుప్పంరూరల్‌ : పాలిటెక్నిక్‌ పూర్తి చేస్తే చక్కటి భవిష్యత్‌ ఉంటుందని, తయారీ రంగంలో సులభంగా ఉద్యోగాలు వస్తాయని ద్రవిడ వర్సిటీ వీసీ దొరస్వామి తెలిపారు. శనివారం కుప్పం పాలిటెక్నిక్‌ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీసీ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరారు. భారత వాయుసేన విశ్రాంత ఇంజినీర్‌ కేఆర్‌ జవహర్‌బాబు మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. ప్రిన్సిపల్‌ రామకృష్ణరావు మాట్లాడుతూ చదువు పూర్తి కాగానే ప్లేస్‌మెంట్‌ ద్వారా ఉద్యోగాలు కల్పించి విద్యార్థుల భవితకు బాటలు వేస్తున్నట్లు వివరించారు. అనంతరం వీసీని ఘనంగా సత్కరించారు. అధ్యాపకులు శ్రీనివాసులు, మల్లపురాజు, సయ్యద్‌ హుస్సేన్‌, నాగరత్న, ప్రవీణ్‌కుమార్‌, టీపీఓ రూపేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement