అతివల అభ్యున్నతికి జగనన్న కృషి | - | Sakshi
Sakshi News home page

అతివల అభ్యున్నతికి జగనన్న కృషి

Mar 8 2026 7:46 AM | Updated on Mar 8 2026 7:46 AM

● ప్రపంచ చరిత్రలో ఎవరూ చేయని సాహసం ● మహిళల పేరుతోనే సంక్షేమ పథకాలు ● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

కార్వేటినగరం: సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుపై అందించి.. ప్రపంచ చరిత్రలో ఎవరూ చేయని సాహసంచేసి చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి కొనియాడారు. శనివారం పుత్తూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నారాయణస్వామి మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దృఢ సంకల్పంతో జగనన్న మహిళల పేరుతో సంక్షేమ పథకాలను అందించి సంక్షేమ వారధిగా నిలిచారని గుర్తుచేశారు. గత ఐదేళ్ల పాలనలో మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం నవరత్నాల పథకాలను అందించారన్నారు. ఆర్థిక సాధికారత పథకాల్లో భాగంగా వైఎస్సార్‌ చేయూత, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం అందించి ప్రతి ఏటా రూ.75 వేలు అందేలా చేసి మహిళలు మహారాణులు గా నిలిచే పథకాలను పంపిణీ చేశారన్నారు. పొదుపు సంఘాలకు పాత అప్పులను తీర్చేందుకు వైఎస్సార్‌ ఆసరా పథకం ప్రవేశపెట్టి ఏప్రిల్‌ 2019 నాటికి ఉన్న బ్యాంకు రుణాలను నాలుగు విడతల్లో ప్రభుత్వం నేరుగా మహిళల ఖాతాల్లో జమచేసిన ఘనత కూడా జగనన్నదే అని అన్నారు. సున్నా వడ్డీ, వైఎస్సార్‌ నేస్తం, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం, ఓసీ సామాజికవర్గా ల్లో ఆర్థికంగా వెనుకబడిన 45–60 మధ్య వయస్సు కలిగిన మహిళలకు ఏటా రూ.15 వేలు జమచేశారన్నారు. పేదలకు ఉన్నత విద్యను అందించడానికి అమ్మ ఒడి, కళాశాల విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన వంటి సంక్షేమ పథకాలను జగనన్న అందించి మహిళా పక్షపాతిగా నిలిచారని గుర్తుచేశారు. అదేవిధంగా వితంతువులు ఆర్థికంగా వెనుకబడకుండా ఒంటరి మహిళా పింఛను అందించి వారికి అండగా నిలిచిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు. మహిహిళా రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ యాప్‌ను పోలీస్టేషన్లలో ఏర్పాటుచేసి వారికి రక్షణ కల్పించారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 31 లక్షల ఇళ్ల పట్టాలను కేవలం మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చే యించిన ఘనత కూడా జగనన్నదేనని అన్నారు. రాజకీయంగా కూడా నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారని, అలాగే తమ కేబినెట్లో ఆరుగురు మహిళలకు చోటు కల్పించి మహిళల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్న ఏకై క ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే అంటూ ప్రపంచ వ్యాప్తంగా నేటికీ కొనియాడుతున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు 20 నెలల పాలనలో బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోయాయని, కనీసం మహి ళా అభివృద్ధి కోసం కనీసం ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టిన దాఖలాలు లేవని నారాయణస్వామి ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement