అనంతపురం జిల్లా కదిరికి చెందిన లక్ష్మీనాయక్, లక్ష్మీబాయి దంపతులకు మొత్తం తొమ్మిది మంది సంతానం. ఆ పెద్ద కుటుంబంలో ఎనిమిదో సంతానంగా జన్మించిన పద్మాంజలి చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచారు. ఇంటర్ వరకు కదిరిలోని ప్రభుత్వ విద్యాసంస్థలలోనే చదువుకున్నారు. తర్వాత 1991లో కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యలో ప్రవేశం పొందారు. అక్కడే ఎంబీబీఎస్, అనంతరం పీజీ కూడా పూర్తిచేశారు. 1994లో తొలుత కదిరి తలపుల పీహెచ్‌సీలో వైద్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని బొమ్మసముద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా, వాయల్పాడు ప్రాంతంలో సేవలందించారు. తర్వాత మదనపల్లి ప్రభుత్వాస్పత్రిలో సూపరిటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా డీసీహెచ్‌ఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. చదువుతో సాధ్యం కానిది ఏదీ లేదని చాటి చెబుతున్నారు.
– చిత్తూరు రూరల్(కాణిపాకం)


