నారాయణవనం: సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పుత్తూరు మహిళా ఎస్‌ఐ వెంకటలక్ష్మి మాట్లాడుతూ పూర్వం వంటింటికే పరిమితమైన మహిళలకు కాలంతో పాటు పురుషులతో పోటీపడి అన్ని రంగాల్లో మేటిగా నిలవడం మహిళగా తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలు పురుషులకు సమానంగా సాధికారతను సాధించాలని కళాశాలల చైర్మన్ అశోకరాజు పులుపునిచ్చారు. కళాశాలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను సన్మానించారు. ప్రిన్సిపాళ్లు మధుసూదనరెడ్డి, జనార్దనరాజు, మహి ళా అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


