టీడీపీ నేతల దౌర్జన్యం నుంచి కాపాడాలని కార్వేటినగరం మండలాని కి చెందిన దిగువ ఎర్రమరాజుపల్లె గ్రామస్తులు బంగారమ్మ, సౌంద ర్య, శ్రావణిలు కన్నీరుమున్నీరయ్యారు. ప్రాణహాని ఉంది.. రక్షణ క ల్పించి న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతల వేధింపు లు, దౌర్జన్యాలు తాళలేక ఆత్మహత్యకు పాల్పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తమకు ఉన్న కొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. గత 40 ఏళ్లుగా డీకేటీ భూమి తమ అను భవంలో ఉందన్నారు. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు వెంకటాద్రిరెడ్డి తమ కుటుంబం పై కక్ష పెంచుకుని దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు కన్నీరు మున్నీరయ్యారు.


