నాటు బాంబు పేలి కుక్క మృతి
గుడుపల్లె: గ్రామ సమీపంలోనే నాటు బాంబు పేలి కుక్క మృతి చెందిన ఘటన స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. స్థానికుల కథనం...మండలంలోని సాలచింతనపల్లె కాలనీ సమీపంలో నాటు బాంబు కరకడంతో ఓ కుక్క అక్కడికక్కడే మృతిచెందింది. మరో కుక్కపిల్లకు గాయాలయ్యాయి. గ్రామ సమీపంలో కొండలు ఉండడం.. అడవి పందులు చుట్టు పక్కల ఉన్న పంట పొలాల్లో తిరగడానికి రాత్రి సమయాలలో వస్తుంటాయి. దీనిని ఆదునుగా చేసుకుని కొంత మంది వేటగాళ్లు వాటి కోసం నాటు బాంబుల ఉండ్లను ఇళ్ల సమీపంలో పెడుతుంటారు. వీటికి కోడి పేగులు చుట్టడంతో ఆ వాసనకు అడ వి పందులు వచ్చి తినేందుకు ప్రయత్నించడంతో అవి పేలిపోతుంటాయి. ఈ క్రమంలో అడవి పందులు అక్కడికక్కడే పడిపోతుంటాయి. కానీ ప్రస్తు తం ఇళ్ల పక్కనే నాటుబాంబులు అమర్చడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కుక్కలకు బదులుగా మనుషులు వెళ్లి ఉంటే ప్రాణాలు పోయేవన్నారు. అధికారులు స్పందించి వేటగాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


