ఆలకించండి.. పరిష్కారం చూపండి | - | Sakshi
Sakshi News home page

ఆలకించండి.. పరిష్కారం చూపండి

Feb 24 2026 7:20 AM | Updated on Feb 24 2026 7:20 AM

ఆలకిం

ఆలకించండి.. పరిష్కారం చూపండి

● వివిధ సమస్యలపై 96 వినతులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ

పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన

అర్జీదారులు

ఓ వైపు భూస్వాముల దందా.. మరోవైపు దొంగ పట్టాల దౌర్జన్యం.. ఇంకో వైపు అనారోగ్యంతో పోరాడుతున్న దివ్యాంగుల కన్నీటి గాథలు!.. ఇవీ సోమవారం కలెక్టరేట్‌ వేదికగా జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో కనిపించిన దృశ్యాలు. ‘వ్యయప్రయాసాలకోర్చి వచ్చాం.. మా మొర ఆలకించి సమస్యలు పరిష్కరించండయ్యా’ అంటూ బాధితులు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ ఎదుట తమ ఆవేదనను వెళ్లగక్కారు. అర్జీలు సమర్పించి కన్నీళ్లు పెట్టుకున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ, జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, ట్రైనీ కలెక్టర్‌ నరేంద్ర పడాల్‌, డీఆర్‌వో మోహన్‌కుమార్‌లకు అర్జీలందజేసి తమ ఆవేదనను వెళ్లగక్కా రు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై మొత్తం 96 అర్జీలు నమోదయ్యాయి.

కష్టమే

తవణంపల్లి మండలం, నలిశెట్టిపల్లి పరిధిలోని 19 గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యాలు లేక పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఉదయం, సాయంత్రం మాత్రమే బస్సు రావడం వల్ల విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే పశువైద్యుడు లేక జీవా లు మృత్యువాత పడుతున్నట్లు ఆ గ్రామస్తులు కలెక్టర్‌ ఎదుట మొరపెట్టుకున్నారు.

ఆలకించండి.. పరిష్కారం చూపండి 1
1/1

ఆలకించండి.. పరిష్కారం చూపండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement