దాతల విరాళం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి సోమవారం ఓ దాత నగదు విరాళం అందజేశారు విశాఖపట్నానికి చెందిన ఉమ, గుణకళ కుటుంబ సభ్యులు స్వామివారి నిత్య అన్నదానం ట్రస్ట్‌కు రూ.50,116ను చెక్కు రూపంలో విరాళంగా అందజేశారు. అదే విధంగా గో సంరక్షణ ట్రస్ట్ కు కూడా రూ.50,116ను సమర్పించారు. ఇలా మొత్తం రూ.1,00,232ను దేవస్థానానికి అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారు లు దాతలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు పాల్గొన్నారు.
అభివృద్ధి శూన్యం..
అక్రమ కేసులు అధికం
శ్రీరంగరాజపురం : కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం.. అక్రమ కేసులు అధికం అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పుత్తూరులోని ఆయన నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కూటమి తప్పులను ప్రశ్నిస్తే అరాచకం, దౌర్జన్యం, దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయని వాపోయారు. కూటమి తప్పులను ఎత్తి చూపినందుకు మాజీ న్యాయమూర్తి జడ శ్రాణ్‌కుమార్‌పై దౌర్జన్యం చేయడం బాధాకరమన్నారు. అతనికి ఏమైనా జరిగితే పూర్తిబాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.
దాతల విరాళం


