శేషాచల వాసా..
పరమ పవిత్రమైన లడ్డూలో కల్లీ జరిగిందన్నారు.. రాజకీయ లబ్ధి కోసం దేవదేవుడైన కలియుగ వైకుంఠవాసుడి ప్రసాదాన్ని వాడుకున్నారు.. లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేశారు. అయితే సుప్రీం కోర్టు వేసిన సీబీఐ నివేదికలో లడ్డూలో కల్తీ జరగలేదన్న సత్యం బయటపడింది... అయినా ఇప్పటికీ వారికి బుద్ధి రాలేదు.. ఇంకా అసత్య ప్రచారం చేస్తున్నారు.. వారికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ అంటూ ఊరూ,వాడా ఆలయాల్లో వైఎస్సార్ సీపీ నేతలు పూజలు, క్షీరాభిషేకాలు, అర్చనలు చేయించారు.
చిత్తూరులో ఎట్టమ్మ తల్లి ఆలయాన్ని శుద్ధి చేస్తున్న విజయానందరెడ్డి తదితరులు
కాణిపాకంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్, నాయకులు
చిత్తూరు కలెక్టరేట్: లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారంతో భక్తుల్ని మానసిక క్షోభకు గురి చేసి, వారి మనోభావాలను దెబ్బతిశారని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. చిత్తూరులోని ఎట్టమ్మ తల్లి ఆలయంలో శనివారం డీసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన నేతలకు కనువిప్పు కలగాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టారు.
తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
కార్వేటినగరం: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని సిట్ అధికారిక నివేదిక స్పష్టం చేసినా, టీడీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని జీడీనెల్లూరు నాయకులు తెలిపారు. కార్వేటినగరం వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
కాణిపాకంలో...
కాణిపాకం: టీడీపీ, కూటమి నేతలకు ఇకనైనా కనువిప్పు కలగాలని కాణిపాకంలో వైఎస్‌ఆర్ సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
అపచారం చేశారు.. దేవుడు సహించడు
నారాయణవనం: తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని అసత్య ప్రచారం చేసి అపచారం చేసిన కుటమి నేతలను దేవుడు సహించడని ఎంపీపీ దివాకర్‌రెడ్డి, నేతలు అన్నాదొరై, రాకేష్ కిరణ్, తిరువేంగడం పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన నారాయణవనంలో టీటీడీ అనుబంధ పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట ప్లకార్డులను ప్రదర్శించారు. మండల కన్వీనర్ సొరకాయలు నేతృత్వంలో నిరసన తెలిపారు.
వారికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ
పలమనేరు: సనాతన ధర్మం పేరు చెపుకుంటూ రాజకీయాలు చేస్తూ హిందువుల మనోభావాలతో ఆడుకున్న వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని శనివారం వైఎస్సార్ సీపీ నేతలు వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద పూజలు చేశారు.
లడ్డూను అపవిత్రం చేశారు!
నగరి: చంద్రబాబు , పవన్‌కళ్యాణ్ తిరుమల లడ్డూ కల్తీ అని అపవిత్రం చేశారని మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, వైఎస్సార్ సీపీ నేత రమేష్‌రెడ్డి అన్నా రు. వారు శనివారం పార్టీ శ్రేణులతో కలిసి కరిమాణిక్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థూపానికి పాలాభిషేకం చేశారు.
తొండమనాడు ప్రసన్న వెంకన్న ఆలయం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నేతలు
కూటమి నేతల పాపాలు అనేకం
చిత్తూరు అర్బన్: స్వా ర్థ రాజకీయాల కో సం ఏకంగా తిరు మ ల వేంకటేశ్వర స్వా మినే వాడుకున్న కూ టమి నేతల పాపాలు అనేకం. 2024 నాటి ఎన్నికల ఫలితాల్లో కూటమి నేతల ఈవీ ఎం దుర్వినియోగం చేసిన విషయాలు బయటకు తెలిసిపోతాయని, కల్తీనెయ్యి అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. కేవలం డైవర్షన్ రాజకీయాల కోసం దేవుడిని కూడా వదల్లేదు. అయితే సీబీఐ చార్జిషీట్‌లో లడ్డూలో ఎలాంటి కల్తీ లేదని నిర్ధారించడం కూటమి నేతలకు చెంపపెట్టులాంటిది. ఇలాంటి నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు.
అసత్యప్రచారం దుర్మార్గం
రాపూరు: శ్రీవారి ప్రసాదం లడ్డూకు వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని కూటమి నాయ కులు అసత్యప్రచారం చేయడం కూటమి నాయకులకు వేంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్‌సీపీ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి, మండల కన్వీనర్ బొడ్డు మధుసూదన్‌రెడ్డి కోరారు. రాపూరు సిద్ధలయ్య ఆలయంలో శనివారం వైఎస్సార్‌సీపీ నాయకుల కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేశారు.
బాబు, పవన్ వి నీచ రాజకీయాలు
పాలసముద్రం: రాజకీయ లబ్ధి కోసం తి రుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నీచ రాజకీయాలకు పాల్పడ్డారని మాజీ డిప్యూటీ సీఎం నారా యణస్వామి విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భక్తుల మనోభావాలకు భగం కలిగించే విధంగా టీడీపీ నాయకులు తిరుమల లడ్డూపై విష ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శ్రీవారి లడ్డూలో జంతు వుల కొవ్వు కలవలేదని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం చేసిన దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ ఆరోపణలను కొన్ని పత్రికలు, ఛానెళ్లు భజాన వేసు కొని తిరుమల లడ్డూకు అప్రతిష్ట కలిగేలా ప్రసా రాలు చేశాయన్నారు.
తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదు
శ్రీకాళహస్తి: తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు లేదని సిట్ నిర్ధారించిందని ముక్కంటి ఆలయ పాలకమండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సూచనలతో శనివారం శ్రీకాళహస్తి మండలం తొండమనాడులోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద శనివారం నిరసనలు తెలిపారు. అంతకు ముందు ఆలయంలో పూజలు చేశారు.
అపవిత్రం.. అబద్దమని తేలింది
కాణిపాకం: తిరుమల లడ్డూను అపవిత్రం చే శారని సీఎం చంద్రబా బు అండ్‌కో ప్రచారం చే యడం అబద్దమని తే లింది. ఇది ముమ్మాటికీ క్షమించారని నేరం. ల డ్డూ తయారీపై ఈ కూ టమి ప్రభుత్వం విష ప్రచారం చేసింది. చంద్రబాబు హిందువుల మ నోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారు. చంద్రబాబునాయుడు ఇలాంటి కల్తీ రాజకీయాలు చే యడం సరికాదు. ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో కల్తీ జరిగిందనడం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడడమే.
శేషాచల వాసా..
శేషాచల వాసా..
శేషాచల వాసా..
శేషాచల వాసా..
శేషాచల వాసా..
శేషాచల వాసా..
శేషాచల వాసా..


