వినాయకుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

వినాయకుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి

Feb 1 2026 3:27 AM | Updated on Feb 1 2026 3:27 AM

వినాయ

వినాయకుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి

కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉమ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ అధికారు లు ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

చిత్తూరు అర్బన్‌: అనుమతి లేకుండా వేసిన లే–అవుట్లు, స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) పథకాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిందని చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ నాగేంద్ర తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 23వ తేదీ వరకు గడువు పొడిగింపు అమల్లో ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకోని వాళ్లు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఆఖరు తేదీ పూర్తయ్యాక స్థలాలను క్రమబద్ధీకరించుకోనివాళ్లపై చట్టరీత్యా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఏనుగుల గుంపు విధ్వంసం

గుడిపాల: అటవీశాఖ అధికారులు టపాకాయలు మాత్రమే పేలుస్తారు. ఏనుగుల జాడలను మా త్రం కనిపెట్టలేకపోయారు. ఏకంగా రైతులే ఏనుగులు పొలాల వైపు రావడం, వాటిని ఫొటోలు తీసి పెట్టినా కూడా వారు ఏ మాత్రం స్పందించలేదు. వారికి ఫోన్‌చేసి పొలంలో ఏనుగులు వచ్చి పంట పొలాలన్నింటిని నాశనం చేశాయని చెప్పి నా కూడా వారు స్పందించలేదు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు ఏనుగులు పంట పొలాలపై దాడులు చేసి పంటలను ధ్వంసం చేశాయి. పానాటూరు, పల్లూరు గ్రామాలకు చెందిన శ్రీహరిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, గణేష్‌రెడ్డి, నీలకంఠరెడ్డి, శరత్‌, అమర్‌నాథ్‌, ఏకాంబరం తదితర రైతుల పొలా ల్లో వరిపంట, మామిడి, కొబ్బరి, పశుగ్రాసం, ఫెన్సింగ్‌లతో పాటు పైపులన్నింటినీ ధ్వంసం చేశాయి. కొంతమంది రైతులు ఏనుగులు పంట పొలాలపై వచ్చిన వీడియోలను తీసి అటవీ అధికారులకు పెట్టినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడంతో గ్రామస్తులే వెళ్లి టపాసులు పేల్చుకుంటూ అటవీ ప్రాంతానికి తరలించారు. దీంతో వీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుస్తుంది. సంబంధిత అటవీ బీట్‌ ఆఫీసర్‌ కుసమకు ఫోన్‌ చేసి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయని ఫోన్‌ చేసినా స్పందించలేదని రైతన్నలు వాపోతున్నారు.

వినాయకుని సేవలో  కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి 1
1/1

వినాయకుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement