● చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అపూర్వ స్వాగతం ● చిత్తూరు
భాస్కరునికి బ్రహ్మరథం
ఏర్పేడు టోల్ ప్లాజా నుంచి
నిర్వహించిన ర్యాలీలో వాహనాలు
10 కిలోమీటర్లు.. 5.30గంటలు..
దామినేడు నుంచి తుమ్మలగుంట గ్రామం వరకు పది కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగడానికి ఐదు గంటలు పట్టింది. చెవిరెడ్డికి వేలాది మంది జనం గుమికూడి బ్రహ్మరథం పట్టడంతో కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు కదిలింది.
250 కార్లు..
400 బైక్‌లతో భారీ ర్యాలీ
ఏర్పేడు టోల్ ప్లాజా నుంచి 250 కార్లు ర్యాలీగా రాగా.. దామినేడు నుంచి 400బైక్ లతో తుమ్మలగుంట వరకు యువత ర్యాలీ నిర్వహించారు.
దామినేడు టూ తుమ్మలగుంట మధ్య దూరం 10 కిలోమీటర్లు.. నడిచి వెళ్లినా గంటలోపే ప్రయాణం.. అయితే విజయవాడ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కారులో ప్రయాణించినా 5.30 గంటల సమయం పట్టింది. అడుగడుగునా హారతులు.. సత్కారం నడుమ ప్రయాణం సాగడమే ఇందుకు కారణం.
తిరుపతి రూరల్: విజయవాడ నుంచి శనివారం తిరుపతి చేరుకున్న వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. వందలాది కార్లు.. బైకులతో పాటు వేలాది మంది జనం జాతీయ రహదారిపైకి చేరుకుని చెవిరెడ్డికి బ్రహ్మరథం పట్టారు.. పలు చోట్ల మహిళలు మంగళ హారతులిచ్చి ఆహ్వానించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పల్లె జనం చెవిరెడ్డిపై పూల వర్షం కురిపించగా ఆయన వారికి అభివాదం చేస్తూ నెమ్మదిగా ముందుకు కదిలారు.
దిష్టి తీసి.. హారతులిచ్చి..
తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడు వ ద్ద, తిరుచానూరు, తనపల్లి క్రాస్ వద్ద పెద్ద ఎత్తున జ నం గుమికూడి చెవిరెడ్డికి గుమ్మడి కాయలతో దిష్టి తీసి స్వాగతం పలికారు. తనపల్లిక్రాస్ వద్ద జిల్లా పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. రామానుజపల్లి సర్కిల్ వద్ద పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి విజయానందరెడ్డి స్వాగతం పలికారు. ఓటేరు వద్ద మహిళలు పెద్ద ఎత్తున వచ్చి హారతులు పట్టగా ఆయన వారికి వినమ్రంగా నమస్కరిస్తూ అందరినీ పలుకరించారు. వేదాంతపురం సర్కిల్, బాలాజీ డెయిరీ వద్ద అ న్ని మండలాల నుంచి వచ్చిన అభిమానులు స్వాగతం పలికారు.
● చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అపూర్వ స్వాగతం ● చిత్తూరు
● చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అపూర్వ స్వాగతం ● చిత్తూరు
● చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అపూర్వ స్వాగతం ● చిత్తూరు


