ఆమడదూరం | - | Sakshi
Sakshi News home page

ఆమడదూరం

Feb 1 2026 3:27 AM | Updated on Feb 1 2026 3:27 AM

ఆమడదూరం

ఆమడదూరం

ఆటకు

విద్యార్థుల్లో నిరుత్సాహం

విద్యార్థులకు చదువుతోపాటు వ్యాయామ విద్య ఎంతో కీలకం. విద్యార్థుల శారీరక, మానసిక, శారీరక, ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి. అయితే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో దీర్ఘకాలంగా వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. వీటిపై దృష్టి పెట్టాల్సిన చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు అలసత్వం వహిస్తోంది. చాలా ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన క్రీడా మైదానాలు ఉన్నప్పటికీ శిక్షణ ఇచ్చే పీడీలు లేకపోవడంతో విద్యార్థులు క్రీడల్లో వెనుకబడుతున్నారు. క్రీడల్లో ఆసక్తి ఉన్నా.. యట శిక్షణ పొందేందుకు స్థోమత లేక పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌: అంతర్జాతీయ, జాతీయ క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఒలింపిక్‌లో ఒక్క పతకం సాధించినా....ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా యి. అయితే క్రీడా శిక్షణకు సరైన వసతులు సమకూర్చడం, ప్రోత్సాహం అందించేందుకు మాత్రం చంద్రబాబు సర్కారు చొరవ చూపడం లేదు. పాఠశాల స్థాయిలో క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులు కళాశాలకు వచ్చే సరికి శిక్షణ లేక క్రీడలకు దూరమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement