విద్యార్థులకు సైన్స్‌ సెంటర్‌ ఉపయోగపడాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సైన్స్‌ సెంటర్‌ ఉపయోగపడాలి

Feb 1 2026 3:27 AM | Updated on Feb 1 2026 3:27 AM

విద్య

విద్యార్థులకు సైన్స్‌ సెంటర్‌ ఉపయోగపడాలి

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లా కేంద్రంలోని సైన్స్‌ సెంటర్‌లో విద్యార్థులకు ఉపయోగపడేలా సేవలందించాలని సమగ్రశిక్ష శాఖ రాష్ట్ర సమన్వయకర్త కల్పన అన్నారు. ఆమె శనివారం జిల్లా కేంద్రంలోని సైన్స్‌ సెంటర్‌, పీసీఆర్‌ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ జిల్లా సైన్స్‌ సెంటర్‌ను త్వరితగతిన వినియోగంలోకి తీసుకొచ్చి సేవలందించాలన్నారు. అనంతరం పీసీఆర్‌ ప్రభు త్వ పాఠశాలలో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌, 100 రోజుల రివిజన్‌ కార్యక్రమంను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి మోహన్‌సింగ్‌, సైన్స్‌ సెంటర్‌ క్యూరేటర్‌ జయంతి పాల్గొన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగలు అరెస్ట్‌

– రూ.85,400 విలువ చేసే

కాపర్‌ స్వాధీనం

కాణిపాకం: ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. 97 ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌ వైర్‌ను దొంగతనం చేసి చివరకు శనివారం పోలీసుల చేతికి చిక్కారు. వారి నుంచి రూ.85,400 విలువ చేసే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ దొంగలను శనివారం కాణిపాకం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట అరెస్ట్‌ చూపించారు. పోలీసులు వివరాల మేరకు.. కాణిపాకం, ఐరాల, పెనుమూరు, గంగాధరనెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, పూతలపట్టు, బీఎన్‌ఆర్‌పేట, చిత్తూరు తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 97 ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. వాటిని పగలగొట్టి అందులోని కాపర్‌ మొత్తం అపహరించారు. వీటిపై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగలపై నిఘా పెట్టారు. శనివారం తానా చెక్‌పోస్టు వద్ద నిందితులను పట్టుకున్నారు. జీడీనెల్లూరు మండలం బంగారెడ్డిపల్లికి చెందిన పులిచర్ల బాలకృష్ణరెడ్డి(42), చంద్రబాబు(39), గణేష్‌(35) అనే ముగ్గురు పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 85,400 విలువ చేసే 61 కేజీల కాపర్‌ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిపై 29పైగా కేసులు ఉన్నట్లు కాణిపాకం ఎస్‌ఐ నరసింహులు వెల్లడించారు.

బాలల కేంద్రాలపై

నిఘా శూన్యం

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలపై ఆ శాఖ అధికారులు నామమాత్రంగా నిఘా పెడుతున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. బాలల సంరక్షణ కేంద్రాలను నిర్వహించాలంటే తప్పనిసరిగా ఐసీడీఎస్‌ శాఖకు అనుబంధమైన బాలల సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనుమతులు పొందిన తర్వాత నిబంధనలకు లోబడి బాలల సంరక్షణ కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో జిల్లా లోని పలు ప్రాంతాల్లో అనధికారికంగా బాలల సంరక్షణ కేంద్రాలు కొనసాగుతున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తూ పలు కేంద్రాలు వెలుస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

విద్యార్థులకు సైన్స్‌ సెంటర్‌ ఉపయోగపడాలి 
1
1/1

విద్యార్థులకు సైన్స్‌ సెంటర్‌ ఉపయోగపడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement