గ్రూప్–1కు ఎంపికై న కృష్ణవేణికి సన్మానం
చిత్తూరు అర్బన్: ఇటీవల విడుదైలన గ్రూప్–1 ఫలితాల్లో ఎస్‌ఆర్‌పురానికి చెందిన కృష్ణవేణి.. వాణిజ్య పన్నుల విభాగంలో సహాయ కమిషనర్‌గా ఎంపికై ంది. ఆమెను చిత్తూరు వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. శనివా రం జరిగిన కార్యక్రమంలో కృష్ణవేణి మాట్లాడుతూ.. తాను గ్రూప్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టినపుడు, హాస్టల్ ఫీజు కట్టడానికి ఆర్థిక సమస్యలు తలెత్తాయ న్నారు. దీనికోసం విజయానందరెడ్డిని ఆశ్రయిస్తే, హా స్టల్ ఫీజు చెల్లించారన్నారు. ఇప్పటికే గ్రూప్–2లో సైతం తనకు ఉద్యోగం వచ్చిందని, తన లక్ష్యం సివిల్స్‌లో ర్యాంకు సాధించి. ఐఏఎస్ కావడమేనని కృష్ణవేణి తెలిపారు. అనంతరం ఆమెకు దుశ్శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛం అభినందించారు.


