తమిళనాడులో ఎంపీడీఓల అధ్యయనం
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీడీఓలు తమిళనాడు రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేశారు. అక్కడ క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమ లు తదితర అంశాలను పరిశీలించారు. రాష్ట్రానికి చెందిన 64 మంది ఎంపీడీఓల బృందం తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించిన పర్యటన ముగిసింది. ఈ బృందంలో చిత్తూరు ఉమ్మడి జిల్లాకు చెందిన ఆరుగురు ఎంపీడీఓలు ఉన్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు తమిళనాడులోని కంచి, తిరుత్తణి, తిరువళ్లూరులో పర్యటించారు. ముఖ్యంగా స్థానిక పాలన, గ్రామ పంచాయతీల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణా కార్యక్రమాల అమలుపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. పంచాయతీరాజ్ శాఖ చేపడుతున్న సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి పథకాల అమలు తీరును గమనించారు. అక్కడి జిల్లా పంచాయతీ కార్యాలయాలను సందర్శించారు. తమిళనాడు రాష్ట్రంలో పథకాల అమలు తీరు మన రాష్ట్రానికి ఉపయోగపడుతుందోనని అధ్యయనం చేశామని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి గంగవరం, గుర్రంకొండ, తొట్టంబేడు, పెద్దపంజాణి, వెదురుకుప్పం, పీలేరు ఎంపీడీఓలు సురేష్, పరమేశ్వర్‌రెడ్డి, సురేంద్రనాథ్, బాలాజీ, పురుషోత్తం, శివకుమార్ పాల్గొన్నారు.


