జెడ్పీ విశ్రాంత సీఈఓకు ఉపశమనం | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ విశ్రాంత సీఈఓకు ఉపశమనం

Jan 25 2026 7:15 AM | Updated on Jan 25 2026 7:15 AM

జెడ్పీ విశ్రాంత సీఈఓకు ఉపశమనం

జెడ్పీ విశ్రాంత సీఈఓకు ఉపశమనం

చిత్తూరు కార్పొరేషన్‌ : జెడ్పీ విశ్రాంత సీఈఓ ప్రభాకర్‌రెడ్డికి ఉపశమనం లభించింది. ఆయనకు రావలసిన నెలవారీ పింఛన్‌లో 75 శాతం మంజూరు చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ప్రభు త్వం అధికారంలో వచ్చాక కక్ష సాధింపులో భాగంగా 2024 జూన్‌ 30న ఉద్యోగ విరమణ చేయాల్సిన మూడు రోజుల ముందు ప్రభాకర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల ముందు జరిగిన పనులు, బిల్లుల మంజూరుపై టీడీపీ నేత ల ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఆయనపై వేటు వేశారు. అయితే ఆయన రిటైర్డ్‌మెంట్‌ బెనిఫిట్లు కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో కో ర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్పందించి ప్రభాకర్‌రెడ్డికి ఉపశమనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గణతంత్ర వేడుకలకు

కుప్పం విద్యార్థిని

కుప్పం : ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు కుప్పం పట్టణానికి చెందిన విద్యార్థిని సాయి చరి త ఎంపికయ్యారు. రమేష్‌బాబు, కవిత దంపతుల కుమార్తె సాయిచరిత బెంగళూరులోని రెవా కళాశాలలో కూచిపూడి నృత్యంలో డిప్లామా చేస్తోంది. ఈ క్రమంలో సాయిచరితను రిపబ్లిక్‌ డే వేడుకల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనకు ఎంపిక చేశారు.

మామిడి రైతులకు

రూ.2కోట్ల బకాయి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): మామిడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నిధి రూ.4 లెక్కన సుమారు 300 మందికి గాను మొత్తం రూ.2 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారులు శనివారం తెలిపారు. తొలివిడతలో 35,045 మంది రైతులకు గాను రూ.149.51 కోట్లను ప్రభు త్వం జమ చేసిందన్నారు. మలి విడతలో 298 మంది రైతులకు 5.6 కోట్లు అందించామని వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికీ రూ.2కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. మరో వారంలో అందరి ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు.

రామకుప్పం ఏపీఓపై చర్యలు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉపాధి పనుల్లో మాయాజాలానికి పాల్పడిన రామకుప్పం ఏపీనో రవికుమార్‌ను సరెండర్‌ చేశారు. వి.కోట మండలంలోని ఉపాధి పనుల్లో చోటు చేసుకున్న రూ.లక్షల నిధుల గోల్‌మాల్‌పై సాక్షిలో ఈ నెల 22వ తేదీ న అమ్మదొంగ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ స్పందించారు. వెంటనే ఏపీఓను సరెండర్‌ చేయాలని డ్వామా పీడీ రవికుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు రామకుప్పం ఏపీఓను సరెండర్‌ చేశారు. ఏపీఓ బాధ్యతలను ఈసీ గణేష్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సూపర్‌ 60 కో–ఆర్డినేటర్‌ నరోత్తమరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పదోతరగతి విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షలు రాసిన వెంటనే ఏపీఆర్‌జేసీ, పాలిటెక్నిక్‌, అగ్రిసెట్‌కు సన్నద్ధమయ్యేందుకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పా రు. ప్రైవేటుగా శిక్షణ పొందాలంటే రూ.వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, అందుకే అభయ పౌండేషన్‌ ఈ సదావకాశం కల్పిస్తోందని వివరించారు. ఉచితంగా విలువలతో కూడిన 30 రోజు ల శిక్షణ అందించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటు పోటీ పరీక్షల మెటీరియల్‌ అందజేస్తారని తెలిపారు. ఇతర వివరాలకు 9440711784 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement