యాప్‌ ఇన్‌స్టాల్‌కే పరిమితం | - | Sakshi
Sakshi News home page

యాప్‌ ఇన్‌స్టాల్‌కే పరిమితం

Dec 5 2025 6:44 AM | Updated on Dec 5 2025 6:44 AM

యాప్‌

యాప్‌ ఇన్‌స్టాల్‌కే పరిమితం

● చిత్తూరు, తిరుపతి జిల్లా పరిధిలో జూన్‌, జూలైలో విక్రయించిన 2.34 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడికి ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి గిట్టుబాటు ధర ఇప్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగిపోయిన రూ.361 కోట్ల బకాయిలు ఇప్పటికీ రైతులకు చెల్లించలేదు. ● పంటల సాగుకు ముందు అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతుకు రూ.20వేలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. మొదటి ఏడాది ఎగనామం పెట్టింది. ఆ తరువాత కొంత మంది రైతులకు మాత్రమే అరకొర ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ● ప్రస్తుత సీజన్‌లో రైతులకు అందుబాటులో ఉంచాల్సిన వరి, వేరుశనగ విత్తనాల ఊసేలేదు. ● రబీ సీజన్‌లో రైతులకు అందుబాటులో ఉంచాల్సిన ఎరువులు పూర్తి స్థాయిలో నిల్వలు లేవు. మండల కేంద్రాల్లో అరకొరగా సరఫరా చేస్తూ తప్పించుకుంటున్నారు. లేకుంటే ఒక్కొ బ్యాగుతో సరిపెడుతున్నారు. కూటమినేతలకు మాత్రం పదుల సంఖ్యలో బ్యాగులు దగ్గరుండి పంపుతున్నారు. ప్రభుత్వం చేసే తప్పిదాలతో వరి సాగు విస్తీర్ణంపై దెబ్బపడుతోంది. ● టమాట గిట్టుబాటు ధర దక్కకుండా పోయింది. ప్రస్తుతం వర్షం కారణంగా కొనుగోలు లేక కొందరు రైతులు పంటను పొలంలోనే విడిచిపెట్టాల్సిన పరిస్థితి. ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చెరుకు సాగు.. దాదాపు కనుమరుగవుతున్నా పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ● ఉచిత పంటల బీమా ఊసేలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. రైతుకు పంట రుణం మంజూరైతే అందులో నుంచి బీమా మొత్తాన్ని కట్‌ చేసుకుని, మిగిలిన సొమ్ముని రైతుల చేతుల్లో పెడుతున్నారు. ఈక్రాప్‌ బుకింగ్‌ను కూడా తూతూమంత్రంగా చేపట్టి రైతుల కష్టాలను పట్టించుకోవడం మానేసింది. ● గతేడాది కురిసిన వర్షాలకు వేల హెక్టార్లలో వేరుశనగ, వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా అన్నదాతకు నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ● చంద్రబాబు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను.. రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. కొన్ని ఆర్బీకే భవనాలను ఇతర కార్యాలయాలకు వినియోగిస్తుండగా, మరికొన్నిటికి తాళాలు వేసి ఉన్నారు. రైతు సేవా కేంద్రాలను అన్నదాతలకు దూరం చేసేందుకు పథకం ప్రకారం అడుగులు వేస్తోంది.

పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఉన్నా.. అటువంటి కార్యక్రమాల ఊసేలేదు. నకిలీల బెడద అరికట్టేందుకు గత ప్రభుత్వం రూ. కోటి వ్యయంతో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌ ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ఈ ల్యాబ్‌ల నిర్మాణం చేపట్టింది. రైతులు శాంపిళ్లు తెస్తే చాలు వ్యవసాయం, మత్స్య, పశు సంవర్థక శాఖలకు సంబంధించి అన్ని పరీక్షలు ఇక్కడ ఉచితంగా చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అనేక చోట్ల అగ్రిల్యాబ్‌లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

మండలానికో చోటే కార్యక్రమం ఫొటోల కోసం సచివాలయాలకు పిలిపించుకుని.. పట్టించుకోని ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా ‘రైతన్నా మీకోసం’ అట్టర్‌ ఫ్లాప్‌

రైతన్నా మీకోసం ప్రోగ్రాం డిజైన్‌ చేసింది మాత్రం ప్రతి రైతు వద్దకు వెళ్లి ప్రభుత్వం అందించే పథకాల గురించి వివరించి ఆ రైతుల ఫోన్లలో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సూచించారు. మొదటి రోజు అక్కడక్కడ ఎమ్మెల్యేలు పాల్గొనగా రైతుల నుంచి డిమాండ్లు పెద్ద ఎత్తున రావడంతో ఆ తర్వాత కనీసం సర్పంచ్‌ స్థాయి ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. అధికారులు కూడా మొహం చాటేశారు. చివరకు ఆర్బీకే సిబ్బంది తమకు ఉన్న పరిచయాలతో రైతుల ఫోన్లలో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి మమ అనిపించారు.

చంద్రబాబు సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్నా మీ కోసం కార్యక్రమం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మొక్కుబడిగా సాగుతోంది. తమను పట్టి పీడిస్తున్న సమస్యలకు సంబంధించి అన్నదాతలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాట వేస్తున్నారు. కర్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మండలానికో చోట కార్యక్రమం జరిపినట్టు ఫొటోలకు ఫోజులిచ్చి మమ అనిపిస్తున్నారు. పచ్చనేతలు ఈ కార్యక్రమం గురించి పట్టించుకోనే లేదు. మొత్తంగా పుడమిపుత్రుడు మాత్రం సమస్యల వలయంలో చిక్కుకుని తిప్పలు పడుతున్నాడు.

సైదాపురంలో రైతులకు కరపత్రాలు పంపిణీ చేస్తున్న అధికారులు(ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, తిరుపతి: అన్నదాతకు భరోసా లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. సమస్యలను పక్కదారి పట్టించేందుకు చేపట్టిన రైతన్నా మీ కోసం కార్యక్రమం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. పంటల సాగు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రభుత్వ మద్దతుపై వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి, పౌల్ట్రీ రైతులందరికీ అవగాహన కార్యక్రమాల పేరిట మరో గారడీకి చంద్రబాబు సర్కారు తెరలేపింది. ఈ 18 నెలల కాలంలో రైతులకు చేసిందేమీ లేకపోయినా ఇప్పుడు ఈ ప్రచార ఆర్భాటం కోసం హడావుడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన రైతన్నా మీ కోసం కార్యక్రమం తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఎప్పుడు? ఎక్కడ? జరిగిందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. గత నెల 24వ తేదీన ప్రారంభించిన రైతన్నా మీ కోసం కార్యక్రమం మొక్కుబడి కార్యక్రమంగా మారింది.

బయట పెట్టని కరపత్రాలు

రైతుల కోసం తమ ప్రభుత్వం 18 నెలల కాలంలో ఎంతో చేసిందని చెప్పుకునేందుకు 16 పథకాలకు సంబంధించి ముద్రించిన కరపత్రాల గురించి ఎక్కడా బయటపెట్టలేదు. రైతుల కోసం 35 ప్రశ్నలతో ముద్రించిన పత్రంలోని కొన్ని ప్రశ్నలు మాత్రం వేసి, వారు చెప్పిన సమాధాన్ని యాప్‌లో అప్‌లోడ్‌ చేసి చేతులు దులుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, కూటమి నేతలు సైతం రైతన్నా మీ కోసం కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించలేదు. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్లిపోతే.. మరి కొందరు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈనెల 3వ తేదీ నిర్వహించాల్సిన గ్రామసభలు సైతం నాలుగైదు చోట్ల తప్ప.. మిగిలిన చోట్ల ఎక్కడా నిర్వహించిన దాఖలాలు కనిపించలేదు. అధికారులు మాత్రం అన్ని చోట్ల గ్రామసభలు నిర్వహించామని వివరణ ఇచ్చుకోవడం గమనార్హం. ఇందుకు రైతులను పట్టి పీడీస్తున్న సమస్యలతే నిదర్శనం. అందులో మచ్చుకుకొన్ని..

ముఖం చాటేసిన అధికారులు

చేసిందేమీ లేదు

బాబు ప్రభుత్వం చెప్పుకునేందుకు చేసిందేమీ లే దని తెలుసుకున్న అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సాహసించలేకపోయారు. క్షేత్రస్థాయిలోకి వెళితే..అన్నదాతలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిలదీస్తారని తెలిసే రైతన్నా మీ కోసం నిర్వహించలేకపోయామని ఓ అధికారి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నిర్వహించామని చెప్పుకునేందుకు.. రైతన్నా మీ కోసం కార్యక్రమం ఉద్దేశం చెప్పకుండా మొదటి రోజు రైతు సేవాకేంద్రాల్లోని అధికారులు కరపత్రాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. మరుసటి రోజు నుంచి ఎవరైనా అడుగుతారేమోనని స్థానిక టీడీపీ నేతలు కొందరు సచివాలయాల వద్దకు చేరుకుని రైతన్నా మీ కోసం కార్యక్రమం నిర్వహించినట్లు ప్రకటించుకుని ఎల్లో పత్రికల్లో ప్రచురించుకున్నారు. ఎవరైనా మీడియా వారు అధికారులను అడిగితే.. ఓ గంట తరువాత మేమే ఫొటో, వివరాలు పంపుతామని చెప్పి.. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వారిని కొందరిని పిలిపించుకున్నారు. వారికి పత్రాలు ఇచ్చినట్లు, మరి కొందరిని కూర్చోబెట్టి ఫొటోలు తీసి, పంపించి చేతులు దులుపుకునే కార్యక్రమాలు చేపట్టారు.

యాప్‌ ఇన్‌స్టాల్‌కే పరిమితం 
1
1/5

యాప్‌ ఇన్‌స్టాల్‌కే పరిమితం

యాప్‌ ఇన్‌స్టాల్‌కే పరిమితం 
2
2/5

యాప్‌ ఇన్‌స్టాల్‌కే పరిమితం

యాప్‌ ఇన్‌స్టాల్‌కే పరిమితం 
3
3/5

యాప్‌ ఇన్‌స్టాల్‌కే పరిమితం

యాప్‌ ఇన్‌స్టాల్‌కే పరిమితం 
4
4/5

యాప్‌ ఇన్‌స్టాల్‌కే పరిమితం

యాప్‌ ఇన్‌స్టాల్‌కే పరిమితం 
5
5/5

యాప్‌ ఇన్‌స్టాల్‌కే పరిమితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement