స్వయం పాలన సంస్థలుగా పంచాయతీలు
రెవెన్యూ డివిజనల్ అధికారి స్థాయిలో పంచాయతీరాజ్ డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీడీఓ)లు విధులు నిర్వహిస్తారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న డీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం వర్చువల్ విధానంలో ఆయన మాట్లాడారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సమన్వయంగా డివిజన్ స్థాయిలో డీడీఓ ఆఫీస్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో 77 డివిజినల్ డెవలప్‌మెంట్ ఆఫీసులను ప్రారంభించామన్నారు.


