అయ్యప్పసేవలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి | - | Sakshi
Sakshi News home page

అయ్యప్పసేవలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Dec 5 2025 6:44 AM | Updated on Dec 5 2025 6:44 AM

అయ్యప

అయ్యప్పసేవలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

● నేడు జిల్లావ్యాప్తంగా మెగా పేరెంట్స్‌ – టీచర్స్‌ మీటింగ్స్‌ ● ఇదేం ఖర్మని వాపోతున్న అయ్యవార్లు

సదుం: అయ్యప్ప దీక్షలో భాగంగా తిరుపతిలో మాలధారణ చేసిన అనంతరం మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయాన్ని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం సందర్శించారు. ఆలయంలోని వినాయక, ఆంజనేయ, నాగమల్లేశ్వరస్వామి ఉపాలయాలలో పూజలు చేశారు. అయ్యప్పస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆయనకు తీర్థ, ప్రసాదాలను అందించారు. అనంతరం భక్తులతో కలసి అన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని ఆయన స్వీకరించారు.

సమస్యల పరిష్కారానికి కృషి

ఎర్రాతివారిపల్లెకి విచ్చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలువురు ప్రజలు కలసి తమ సమస్యలను విన్నవించారు. సమస్యలు విన్న ఎమ్మెల్యే, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కాలినడక భక్తులకు సౌకర్యాలు..

ప్రతి ఏటా మండలం మీదుగా కర్ణాటక రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తిరుమలకు కాలి నడకన వెళ్తుంటారు. వారి సౌకర్యం కోసం షె డ్లు, భోజన సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్‌ రెడ్డి, కొండవీటి నాగభూషణం, జింకా చలపతి, వెంకటరెడ్డి యాదవ్‌, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, పులిచర్ల ఎంపీపీ సురేంద్రనాథ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ రెడ్డెప్ప రెడ్డి, ఐటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌ రెడ్డి, కో–ఆప్షన్‌ సభ్యుడు ఇమ్రాన్‌ పాల్గొన్నారు.

కోటి సంతకాల

ప్రతులు అందజేత

తిరుపతి సిటీ: ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఆ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి హరిప్రసాద్‌రెడ్డి 30 వేల సంతకాల సేకరణ పూర్తి చేశారు. ఆ ప్రతులను గురువారం తాడేపల్లెలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి అందజేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్‌ను వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

పొలిటికల్‌ పీటీఎంలకు వేళాయే..!

చిత్తూరు కలెక్టరేట్‌ : రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను రాజకీయ వేదికలుగా మార్చి శుక్రవారం నుంచి మెగా పేరెంట్‌ – టీచర్స్‌ మీటింగ్‌ కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే ఈ కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఒరిగేదేమీ లేకపోయినా రాజకీయంగా తమ పబ్లిసిటీ కోసం నిర్వహించుకుంటున్నారు. మరోవైపు ఈ మెగా పేరెంట్స్‌ – టీచర్స్‌ సమావేశాలు (పీటీఎం) ఉపాధ్యాయుల్లో గుబులు రేపుతున్నాయి. ఎక్కడా ఏలోటూ రాకుండా నూరుశాతం తల్లిదండ్రుల హాజరు ఉండాలని ఒక పక్క.. స్థానిక రాజకీయ నాయకులను తప్పనిసరిగా ఆహ్వానించాలన్న ఆదేశాలు మరోపక్క టీచర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో ఎన్నో పేరెంట్స్‌ – టీచర్స్‌ సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు ఇప్పుడు మెగా పీటీఎం అంటే భయపడుతున్నారు.

చాలీచాలని నిధులతో ఆర్భాటం

మెగా పీటీఎం నిర్వహణ ఏర్పాట్లకు రాష్ట్ర సమగ్ర శిక్ష నుంచి జిల్లాకు రూ.47.54 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. 30 మంది పిల్లలు ఉంటే రూ.900, 31 నుంచి 100 మంది ఉంటే రూ.2,250, 101 నుంచి 250 ఉంటే రూ.4,500, 250 నుంచి 1,000 వరకు ఉంటే రూ.6,750 చొప్పున బడ్జెట్‌ కేటాయించారు. ఈ మొత్తం నిధులతోనే షామియానా, మైక్‌సెట్లు, అలంకరణ, బొకేలు తదితర సామగ్రి సమకూర్చాలి. ఈ డబ్బుతోనే తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలి. అయితే ఏ మూలకూ సరిపోని అరకొర బడ్జెట్‌తో సమావేశాలు నిర్వహించడం కష్టమని, భోజనం ఏర్పాట్లు తమవల్ల కాదని ఉపాధ్యాయులు తెగేసి చెబుతున్నారు.

అయ్యప్పసేవలో  ఎమ్మెల్యే పెద్దిరెడ్డి 
1
1/1

అయ్యప్పసేవలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement