
రంకెలేసిన ఉత్సాహం
వెదురుకుప్పం: ఉత్సాహం ఉరకలేసింది...కాలుదువ్వి న కోడె గిత్తలు ... జనసమూహాన్ని చీల్చుకుంటూ దూ సుకుపోయిన పోట్లగిత్తలు తమ పౌరుషాన్ని చూపా యి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని కొండకిందపల్లెలో జరిగిన జల్లికట్టు జోష్ తెచ్చింది. యువత కేరింతల మధ్య జరిగిన జల్లికట్టు దుమ్ము రేపింది. నిర్వాహకులు ముందుగా ఎడ్లకు పలకలు, వస్త్రాలతో పాటు బెలూన్‌లు కట్టి పందేలకు సిద్ధం చేశారు. అంతకు ముందే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత అక్కడికి చేరుకున్నారు. పోట్లగిత్తలు రంకెలేస్తూ దూసుకుపోయాయి. పరుగులు తీస్తున్న ఎడ్లను కట్టడి చేసేందుకు యువకు లు ప్రయత్నించారు. ఎడ్ల వేగాన్ని నిలువరించలేక చేతులెత్తేశారు. ఉత్సాహంతో పందెంలో పాల్గొన్న యువత పరుగులు తీస్తున్న కోడెగిత్తలను కట్టడి చేసి పలకలను లాక్కొన్నారు. కొన్ని ఎడ్లు జన ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా యువతకు చిక్కకుండా పరుగులు తీశాయి. పశువుల కిందపడి కొందరికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారితో గ్రామం జనంతో కిక్కిరిసింది.
దూసుకుపోతున్న కోడెగిత్తలు
గ్రామంలో జన సందడి

రంకెలేసిన ఉత్సాహం