సార్‌ చెప్పారు.. గిఫ్ట్‌ బాక్స్‌ ఇవ్వు! | - | Sakshi
Sakshi News home page

సార్‌ చెప్పారు.. గిఫ్ట్‌ బాక్స్‌ ఇవ్వు!

Oct 19 2025 6:17 AM | Updated on Oct 19 2025 7:07 AM

– IIలో

న్యూస్‌రీల్‌

యంత్రాలతోనే పనులు పాత పనులకు కొత్త మెరుగులు తమ్ముళ్లకే గోకులం షెడ్లు చాలీచాలని పనులతోనెట్టుకొస్తున్న కూలీలు పుంగనూరు నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి

‘సార్‌ చెప్పార్‌.. గిఫ్ట్‌ బాక్స్‌ ఇవ్వు.. లేకుంటే నెక్ట్స్‌ ఇయర్‌ నీకు లైసెన్స్‌ రాదు’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

పుంగనూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించేశారు. పెత్తనాన్ని చేతిలోకి తీసుకుని పేట్రేగిపోతున్నారు. వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. పట్టపగలే యంత్రాలతో పనులు చేస్తూ కూలీల కడుపు కొడుతున్నారు. దొంగ మస్టర్లు సృష్టించి జేబులు నింపుకుంటున్నారు. అధికారులను బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారు. మూగజీవుల సంరక్షణ, వృద్ధి కోసం ప్రవేశపెట్టిన గోకులం షెడ్ల నిర్మాణ పనులూ తమవారికే కట్టబెట్టేశారు. వాటిపైనే ఆధారపడ్డ పేద కుటుంబాలను వీధిన పడేశారు. తమ్ముళ్ల తీరు చూసి నియోజకవర్గ ప్రజలు ఔరా..! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: పుంగనూరు నియోజకవర్గంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. కూలీల ద్వారా చేయాల్సిన పనులను పట్టపగలే యథేచ్ఛగా జేసీబీలు, హిటాచీలతో చేస్తున్నారు. మట్టిని ట్రాక్టర్లతో తరలించి బిల్లులు చేసుకంటున్నారు. కూలీలే పనిచేసినట్లు తప్పుడు మస్టర్లు సృష్టిస్తున్నారు. అధికారులను బెదిరించి కూలీల ఖాతాలో వేతనాలు జమ చేయిస్తున్నారు. ఆపై వారి ద్వారా కోట్లాది రూపాయలు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు గతంలో చేసిన పనులకు మెరుగులద్ది ఆ పనులకే మళ్లీ బిల్లులు చేసుకుంటున్నారు. పథకం ప్రారంభం నుంచి పనిచేస్తున్న సిబ్బంది తమకు అనుకూలంగా లేరని నిర్ధాక్షణ్యంగా తొలగించేస్తున్నారు. తమకు అనుకూలమైన వారిని నియమించుకుని పబ్బం గడుపుకుంటున్నారు. పశువుల సంరక్షణ కోసం మంజూరు చేసిన గోకులాలు సైతం తమ్ముళ్లు వశం చేసుకున్నారు. గోవులు లేకపోయినా గోకులాల పేరిట దోచుకు తింటున్నారు.

నియోజకవర్గంలో ఉపాధి ఖర్చు

రూ.65.07 కోట్లు

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పుంగనూరు నియోజకవర్గంలో 2024–2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉపాధి నిధులు రూ.65.07 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనాల ద్వారా రూ.47.65 కోట్లు, మెటీరియల్‌ కంపోన్మెంట్‌ ద్వారా రూ.17.42 కోట్లు ఖర్చు చేశారు. ఆ నిధులతో నియోజకవర్గంలో మొత్తం 19,113 పనులు చేసినట్లు రికార్డులు సిద్ధం చేశారు.

యంత్రం..ఇదిగో సాక్ష్యం

గోకులం.. తమ్ముళ్లకే అగ్రతాంబూళం

పుంగనూరు మండలం, చదళ్లలో జేసీబీలతో చేసి, ట్రాక్టర్లతో మట్టిని అన్‌లోడ్‌ చేసిన తమ్ముళ్లు

పుంగనూరు నియోజకవర్గంలో కూలీలు చేయాల్సిన పనులను కూటమి నేతలు యంత్రాలతో చేసి, కూలీలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు.

పుంగనూరు మండలం, కుమ్మరనత్తం పంచాయతీ చెరువులో ఫారంపాండ్‌ను జేసీబీతోనే చేశారు.

చదళ్ల చెరువులో చేపల కుంట, క్యాటిల్‌ఫామ్‌ను యంత్రాలతోనే చేశారు. ఇలా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో యంత్రాలతో పనులు చేసి కూలీల కడుపు కొడుతున్నారు.

రొంపిచెర్ల, పులిచెర్ల, సోమల, చౌడేపల్లె, సదుం మండలాల్లో 90 శాతం మేరకు ఉపాధి పనులు జేసీబీలతోనే చేశారు.

ఆ తర్వాత వాటిని కూలీలు చేసినట్టు రికార్డులు సృష్టించి జేబులు నింపుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు.

పశు సంపద వృద్ధి, సంరక్షించాలనే ధ్యేయంతో అమలు చేస్తున్న గోకులం షెడ్లు తమ్ముళ్ల పరమయ్యాయి. పశువులు ఉన్న రైతులను గుర్తించి, వాటి సంఖ్య ఆధారంగా షెడ్లను గ్రేడ్ల వారీగా మంజూరు చేయాల్సి ఉంది. కానీ పుంగనూరు నియోజకవర్గంలో నిబంధనలు ఉల్లంఘించారు. కేవలం తెలుగు తమ్ముళ్లకు మాత్రమే గోకులం షెడ్లు అప్పగించారు. కొందరు పాత గోకులాలకు సైతం మెరుగులు దిద్ది బిల్లులు చేసి స్వాహా చేశారు.

ఉపాధి పనుల్లో భారీ అవకతవకలు

సార్‌ చెప్పారు.. గిఫ్ట్‌ బాక్స్‌ ఇవ్వు!
1
1/3

సార్‌ చెప్పారు.. గిఫ్ట్‌ బాక్స్‌ ఇవ్వు!

సార్‌ చెప్పారు.. గిఫ్ట్‌ బాక్స్‌ ఇవ్వు!
2
2/3

సార్‌ చెప్పారు.. గిఫ్ట్‌ బాక్స్‌ ఇవ్వు!

సార్‌ చెప్పారు.. గిఫ్ట్‌ బాక్స్‌ ఇవ్వు!
3
3/3

సార్‌ చెప్పారు.. గిఫ్ట్‌ బాక్స్‌ ఇవ్వు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement