
సీ్త్రలను అగౌరవపరిచే పార్టీ టీడీపీ
● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
కార్వేటినగరం : సీ్త్రలను అవమానించే పార్టీ టీడీపీ అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. పుత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశమన్నారు. భారతీయ సీ్త్రలు చీర, బొట్టు ధరించడం సంప్రదాయమన్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బహిరంగ సభలో తన కుమార్తె, గంగాధరనెల్లూరు నియోజవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మిని సభ్యసమాజం తలదించుకునేలా అసభ్యకరమైన తీరిలో చీర, బొట్టు, నగలు గురించి అవమానకరంగా మాట్లాడడం దారుణమన్నారు. కల్తీ మద్యం గురించి కృపాలక్ష్మి నిరసన తెలియజేస్తే పరుష పదజాలంతో మాట్లాడం సమంజసమేనా....? అని ప్రశ్నించారు. ‘నీకు జన్మనిచ్చింది కూడా మాతృమూర్తే’ అనే విషయాన్ని మరిచి వ్యంగంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. తాను అవినీతి, భూకబ్జా చేశానని ఆరోపించడం కాదు.. నిరూపించాలని సవాల్ విసిరారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దని హితవు పలికారు.
పచ్చనపల్లిలో పిడిగుల వాన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం, పచ్చనపల్లి ప్రాంతంలో శనివారం వేకువజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ తరుణంలో ఓ చెట్టుపై పిడుగు పడింది. దాని ధాటికి చెట్టు రెండుగా చీలింది. ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని లేదు. మూడు రోజుల కిత్రమే అనంతాపురం గ్రామంలో ఓ విద్యార్థి పిడుగుపాటుకు మృతి చెందాడు. చెట్ల కింద ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని మండల అధికారులు సూచించారు.

సీ్త్రలను అగౌరవపరిచే పార్టీ టీడీపీ