
ప్రతి షాపు నుంచి ఇవ్వాల్సిందే!
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తాత్కాలిక టపాసుల దుకాణాలు పెట్టుకునేందుకు అనుమతులిచ్చారు. ఈ అనుమతులతో వారం రోజుల పాటు టపాసులు విక్రయించొచ్చు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 36, నగరి, పుంగనూరు, పలమనేరు, కుప్పం, జీడీ నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో 140 మొత్తం 176 తాత్కాలిక షాపులకు అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతులిచ్చారు. వీటితోపాటు జిల్లాలో పర్మినెంట్ లైసెన్స్‌లు కలిగిన టపాసుల షాపులు 17 ఉన్నాయి. ఈ ఏడాది అనుమతులిచ్చిన ఆయా శాఖల అధికారులకు ప్రతి షాపు నిర్వాహకుడు కచ్చితంగా గిఫ్ట్ బాక్సులు ఇచ్చుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.