
గర్జించిన కలం!
కలం గర్జించింది. వేధింపులపై గళం విప్పింది. జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటించింది. తప్పులెత్తి చూపితే సరిదిద్దు కోవాల్సింది పోయి కూటమి ప్రభుత్వం వేధింపులకు దిగడం ఏమిటని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం తగదని హెచ్చరించింది. సాక్షి మీడియాపై కక్ష సాధింపులు మానుకోవాలని హితవు పలికింది. లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేసింది.
పలమనేరు/కుప్పం: ప్రజాసామ్యంలో మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం తగదని మేధావులు, ప్రజాసంఽఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఏ ప్రభుత్వంలోనూ ఇలా కేసుల సంస్క్రృతి లేదని మండిపడ్డారు. కొన్ని రోజులుగా సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులను ఎండగట్టారు. ఇలాంటివి ప్రమాదకరమని, వెంటనే ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. పలువురు జర్నలిస్ట్‌లు నిరసనలు చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
సాక్షిపై అక్రమ కేసులు అప్రజాస్వామికం
సాక్షి పత్రిక, ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు అప్రజాస్వామికమని కుప్పం పాత్రికేయుల బృదం స్పష్టం చేసింది. శనివారం కుప్పంలో నిరసన చేపట్టారు. కల్తీ మద్యంపై వరుసుగా సాక్షి ప్రతికలో వస్తున్న కథనాలు చూసి జీర్ణించుకోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం తయారీ దారులను వదిలి మీడియాకు సంకెళ్లు వేయాలనుకోవడం భావ్యం కాదన్నారు. ‘సాక్షి’పై కక్ష సాధింపులు మానుకోవాలని హితవు పలికారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం, నోటీసులు ఇవ్వడం, విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం బాధాకరమన్నారు. ఇలాంటి వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. కుప్పం విలేకర్లు వెంకటాచలం, హరినాథ్, సుబ్రమణ్యం, నాదముని, నాగరాజు, గణేష్, చలపతి తదితరులు పాల్గొన్నారు.
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా?
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు తగదని పలమనేరు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పేర్కొన్నారు. సాక్షి విలేకరులు, ఎడిటర్ ధనుంజయరెడ్డిపై వేధింపులకు నిరసనగా స్థానిక ఆర్‌డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం కార్యాలయ ఏవో కుమారస్వామికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత్రికేయులపై కేసులు పెట్టడం ప్రజాసామ్యంలో ఎక్కడా లేదన్నారు. జర్నలిస్టులు రమేష్, మణి, ఆది, మునిరత్నం, దిలీప్, వేణు, అశోక్, మురళి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
మీడియాపై కేసులా..?
ప్రజాసామ్యంలో నాలుగో స్తంభంలా పనిచేసే మీడియాపై కేసులు, విలేకరుల నోరునొక్కడం, పత్రికా కార్యాలయాలపై దాడులు మంచిది కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రం మీడియా నోరుకొక్కే ప్రయత్నాలు సాగుతు న్నాయి. పోలీసులు సైతం నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. – అబ్దుల్ సుభాన్,
సౌత్‌ఇండియా మీడియాసెల్ సెక్రటరీ

గర్జించిన కలం!

గర్జించిన కలం!