
కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని శుక్రవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.1,77,02,032ల ఆదాయం వచ్చింది. బంగారం 52 గ్రాములు, వెండి 510 కిలోలు లభించింది. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.16,845, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.20,699 వచ్చింది. యూఎస్‌ఏవి 139 డాలర్లు, సింగపూర్‌వి 2 డాలర్స్, మలేషియావి 11 రింగిట్స్, యూఏఈ 25 దిర్హామ్స్, కెనడా 110 డాలర్లు, ఆస్ట్రేలియావి 110 డాలర్స్, యూరోవి 10 యూరోలు వచ్చాయి. డీఈవోలు సాగర్‌బాబు, ఏఈవోలు ఎస్వీ క్రిష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.