
కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి
తవణంపల్లె : విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఇందిర ఆదేశించారు. గురువారం మండలంలోని తొడత్తర హైస్కూల్, తొడత్తర మోడల్ స్కూల్‌ను తనిఖీ చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. తొడత్తర మోడల్ స్కూల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. డిప్యూటీఈఓతో పాటు తవణంపల్లె ఎంఈఓలు హేమలత, మోహన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.