కరకట్ట బంగ్లాకు కోట్లు! | - | Sakshi
Sakshi News home page

కరకట్ట బంగ్లాకు కోట్లు!

Oct 14 2025 7:09 AM | Updated on Oct 14 2025 7:09 AM

కరకట్ట బంగ్లాకు కోట్లు!

కరకట్ట బంగ్లాకు కోట్లు!

‘నారా’వారి సురాపానాన్ని అరికట్టండి జిల్లాలో కల్తీ మద్యంపై నిరసనల హోరు కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు కల్తీ మద్యం కేసును సీబీఐకి అప్పగించండి ఎకై ్సజ్‌ కార్యాలయాల వద్ద మిన్నంటిన నినాదాలు

కల్తీ మద్యంతో..

చిత్తూరు అర్బన్‌: ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నాయకుల కనుసన్నల్లోనే నకిలీ మద్యం బాగోతం నడిచింది. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో బయటపడ్డ నకిలీ మద్యం తయారీ.. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ చేరింది. ఇందులో వచ్చిన లాభాలు కూటమి నేతలు పంచుకు తిన్నారు. అందులో పెద్ద మొత్తంలో కరకట్ట బంగ్లాలోని పెద్దలకు కమీషన్లు అందాయి. వెంటనే ఈ వ్యహారాన్ని సీబీఐకి అప్పగించాలి. దీనిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలి’ అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. నకిలీ మద్యం ఘటనపై సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

చిత్తూరులో..

చిత్తూరు నగరంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ.విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కట్టమంచి చెరువు వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహం నుంచి అర్బన్‌ ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అక్కడ నిరసన వ్యక్తం చేశారు. నకిలీ మద్యం అరికట్టాలని, బెల్టు దుకాణాలు తొలగించాలని ఎకై ్సజ్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. డిప్యూటీ మేయర్‌ చంద్రశేఖర్‌, రాష్ట్ర మునిసిపల్‌ విభాగం ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ హయంలో నకిలీమద్యం ఏరులై పారుతున్నా ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా పారదర్శకంగా అమ్మకాలు సాగిస్తే, తమ నాయకులను వేధించడానికి తప్పుడు కేసులు బనాయించారన్నారు.

పలమనేరులో..

నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆధ్వర్యంలో పలమనేరులోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద నుంచి ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేసి, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పట్టణంలో నకిలీ మద్యంపై నినాదాలు చేస్తూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

పూతలపట్టులో..

పూతలపట్టు వైఎస్సార్‌సీపీ నాయకులు చిత్తూరులోని అర్బన్‌ ఎకై ్సజ్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని, ఇందులోని ప్రభుత్వ పెద్దల పాత్ర తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. అనంతరం ఎకై ్సజ్‌ పోలీసులకు వినతిపత్రం అందచేశారు.

కుప్పంలో..

కుప్పం పట్ణణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు ఎమ్మెల్సీ భరత్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

నారాసురపాలన నశించాలి

గంగాధరనెల్లూరులో

ఎక్సైజ్‌ సీఐకి వినతి పత్రం అందజేస్తున్న మాజీ మంత్రి ఆర్కే రోజా

నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో కలిసి కల్తీ మద్యంపై నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. నకిలీ మద్యం స్కాంపై సిట్‌ విచారణ వద్దని, సీబీఐ విచారణ చేపట్టాలని నాయకులు డిమాండ్‌ చేశారు. నారావారి సారా పాలన నశించాలని నినాదాలు చేశారు. ఎకై ్సజ్‌ సీఐ శ్రీనివాస్‌ రెడ్డికి వినతి పత్రం అందించారు.

జీడీ నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో కార్వేటినగరంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ర్యాలీ నిర్వహించారు. మహిళలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. కల్తీమద్యం అమ్మకాలు బెల్టు దుకాణాల్లోనే జరిగాయని, వీటిని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఎకై ్సజ్‌ అధికారులకు వినతిపత్రం అందచేశారు. నకిలీ మద్యం అమ్మకాలతో మహిళల తాళిబొట్లు తెగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement