
రైలు ఢీకొని నేత కార్మికుడి మృతి
పుత్తూరు: పట్టణంలోని ధర్మరాజుల స్వామి ఆలయం ఎదురుగా రైల్వే ట్రాక్ట్ దాటుతుండగా ప్రమాద వశాత్తు రైలు ఢీకొని నేత కార్మికుడు దుర్మరణపాలైన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకొంది. రైల్వే పీసీ శివ కథనం మేరకు.. స్థానిక దాసరిగుంట వీధికి చెందిన ఎస్.వి.కిష్టన్(63) పుత్తూరు టౌన్‌లోకి వెళ్లేందుకు ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు రేణిగుంట రైల్వే పోలీసుటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాటు తుపాకీతో సహా
వ్యక్తి అరెస్ట్
పుంగనూరు: సోమల మండలం అన్నెమ్మగారిపల్లె అటవీ ప్రాంతంలో బోయకొండప్ప సోమవారం ద్విచక్ర వాహనంలో నాటు తుపాకీ పెట్టుకుని సంచరిస్తుండగా అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. ఫారెస్ట్ రేంజర్ శ్రీరాములు ఆధ్వర్యంలో సిబ్బంది అతని వద్ద నుంచి నాటుతుపాకీని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పింఛన్లు మంజూరు
చేయించండయ్యా!
– దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రుల మొర
తవణంపల్లె: ‘పిల్లల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొన్నాం.. కూటమి ప్రభుత్వం మాత్రం కనికరం చూపడం లేదు..’ అంటూ దివ్యాంగ పిల్లల తల్లిండ్రులు ప్రాధేయపడ్డారు. కూటమి ప్రభు త్వం వచ్చినప్పటి నుంచి పింఛన్లు మంజూరు చేయాలని అర్జీలు ఇస్తూనే ఉన్నాం... కానీ ఇప్పటి వరకు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల పిల్లలతో ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొన్నారు. ఎంపీడీఓ హరిప్రసాద్‌రెడ్డికి తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ పిల్లల జీవనాధారం కోసం పింఛన్లు మంజూరు చేసి ఆదుకోవాలని మొరపెట్టుకొన్నారు. దీనిపై ఎంపీడీఓ స్పందిస్తూ కొత్త పింఛన్లు మంజూరు కోసం ప్రభుత్వం అనుమతిచ్చే వరకు ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. అనంత రం దివ్యాంగులు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వరచౌదరి స్థానిక ఎమ్మె ల్యే ద్వారా డ్వామా పీడీతో మాట్లాడి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. సహిత విద్యా ఉపాధ్యాయుడు దేవేంద్ర పాల్గొన్నారు.

రైలు ఢీకొని నేత కార్మికుడి మృతి