
ఐక్యంగా ఉద్యమిద్దాం!
పుత్తూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి అన్ని సంఘాల వారు కలసి రావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగారావు పిలుపు నిచ్చారు. సోమవారం పుత్తూరులోని ఓ ప్రైవేటు కల్యా ణ మండపంలో 8వ సీఐటీయూ జిల్లా మహా సభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సభలను స్థానిక సీఐటీయూ సీనియర్ నేత సుబ్రమణ్యంపిళ్‌లై చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. వక్తలు మాట్లాడుతూ కార్మికుల హక్కులను క్రమేపీ తగ్గిస్తూ, సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి అన్ని కార్మిక, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షు డు అజయ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు నాగరాజు, పుల్లయ్య, నాయకులు సుబ్రమణ్యం, జయచంద్ర, ప్రసాద్‌రావు, రమేష్, రామకృష్ణ, శ్రీధర్‌బాబు, జనార్దన్, వాణిశ్రీ తదితరులు ప్రసంగించారు. తర్వా త పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.