
ఉప్పొంగినది!
– చిత్తూరులో నీవానది బీభత్సం
చిత్తూరు నగరంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నీవాది ఉప్పొంగింది. తమిళనాడులోని పరదరామి, గుడియాత్తం మీదుగా వర్షపు నీళ్లు యాదమరి నుంచి చిత్తూరు నగరంలోని నీవానదిలోకి భారీగా వచ్చి చేరింది. సోమవారం ఉదయం 4 గంటల నుంచే నీవానది పరివాహక ప్రాంతమైన తేనబండ, గంగాకాలనీ, వీరభద్రకాలనీ, రాజుగుడి వీధి, లిల్లీబ్రిడ్జి, కై లాశపురం, తోటపాళ్యంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. ఇళ్లలోకి వర్షపునీళ్లు రావడంతో నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వేలాది కుటుంబాలున్న నీవానది పరివాహక ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.
– చిత్తూరు అర్బన్